వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకి ఊహించని షాక్ ఎదురైంది. పార్టీలో ప్రస్తుతం రోజా పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిగా మారింది. ఎప్పటి నుంచో పార్టీ కోసం కృషి చేస్తున్నా ఆమెకు కనీసం మంత్రి పదవి ఇచ్చింది లేదు. ఆ విషయంలో ఆమె బాధపడకుండా ఉండేందుకు ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి కట్టపెట్టారు. కాగా.. ఇప్పుడు ఆ పదవి నుంచి కూడా ఆమెను తొలగించడం గమనార్హం.
ఏపీఐఐసీ ఛైర్మన్ గా రోజాని తొలగించి.. ఆ పదవిని మెట్టు గోవర్థన్ రెడ్డికి అప్పగిస్తూ.. వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. రోజా సహా.. ఆమె అభిమానులు సైతం షాకయ్యారు. మంత్రి పదవి ఇవ్వకపోగా.. ఉన్న పదవి నుంచి కూడా తీసేయడం ఎంత వరకు న్యాయమంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా.. మరో వైపు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా ఉన్న తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు సైతం షాక్ తగిలింది. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా పనిచేస్తున్న ఆయనను ఆ పదవి నుంచి తొలగించారు.
రాష్ట్ర స్థాయిలో రెండు పదవుల విధానానికి ముగింపు పలకాలని జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నిర్ణయంలో భాగంగానే .. కొందరు ఎమ్మెల్యేలు ఇలా పదవులు పోగొట్టుకోవాల్సి రావడం గమనార్హం.