ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇప్పుడు వైసీపీ వర్గాల్లో ఈ టైటిల్ గురించే చర్చ నడుస్తోంది. వైసీపీలో బిగ్ బాంబ్ త్వరలోనే పేలనుందా ? అంటే అవుననే అంటున్నారు. వైసీపీలో పదవుల విషయంలో లెక్కే లేదు. ఏ పదవి వచ్చినా పార్టీ నేతలకే… మరో మూడేళ్ల పాటు ఏ చిన్న పదవి కూడా ఏపీలో ప్రతిపక్ష పార్టీ నేతలకు వెళ్లే ఛాన్సే లేదు. నామినేటెడ్ పదవి అయినా, ఎన్నికలు జరిగినా కూడా వైసీపీకి తిరుగులేనట్టే ? అయితే పార్టీలో ఆశావాహులు మాత్రం చాలా మందే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే జగన్ ముందు నుంచి సొంత పార్టీ నేతలకన్నా ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారికి, ఎన్నికల తర్వాత పార్టీలో చేరిన వారికి పదవులు ఇస్తున్నారు.
దీంతో అసలు పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు రావడం లేదు. ఎవరిని ఎన్ని సార్లు అడిగినా, ఎంత మొర పెట్టుకున్నా స్పందన లేదు. అయినా అసంతృప్తిని మాత్రం భరిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు త్వరలోనే కేబినెట్ ప్రక్షాళన జరగనుంది. ఇప్పుడు జగన్ కేబినెట్లో ఉన్న వారిలో 90 శాతం మందిని మార్చేస్తానని జగన్ ముందే చెప్పారు. ఇక కేబినెట్లోకి వస్తామని ఆశలు పెట్టుకుంటోన్న వారిలో 40 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా మంత్రి పదవి కోసం అర్హులే ఉన్నారు. వీరి సీనియార్టీ, వీరు జగన్ కోసం చేసిన త్యాగాలు ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే ఇప్పుడు కేబినెట్లో ఉన్న వారు కంటే వారే అర్హులు.
అయితే జగన్ కేబినెట్లో ఉన్న మంత్రుల్లో 8 – 10 మంది మంత్రులను తొలగించడానికి సిద్ధంగా లేరు. అప్పుడు కొత్తగా మరో 15 మంది మంత్రులకే ఛాన్స్ వస్తుంది. ఇక వేడు కత్తి వేలాడుతోన్న వారిలో కూడా ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన మంత్రులే ఉన్నారు. కేబినెట్ పదవి రేసులో ఉన్న వారిలో 20 మందికి షాక్ తప్పదు. కేబినెట్ ప్రక్షాళన తర్వాత జగన్ ఎంత శాంతపరిచినా బడబాగ్ని రగలడం ఖాయం. పైగా ఎన్నికలకు చివరి రెండేళ్లలో ఈ అసంతృప్త జ్వాలలు మామూలుగా ఉండవు. చాలా మంది నేతలు తాము పార్టీ కోసం చేసిన త్యాగాల చిట్టాను పట్టుకుని.. మంత్రి పదవి ఇవ్వాలని విన్నపాలు, లాబీయింగ్‌లు స్టార్ట్ చేసేశారట. ఎవరి ఆశలు అయితే నెరవేరవో వాళ్ల ఆగ్రహానికి బ్రేకులు ఉండవ్… ఇటు పార్టీకి వారు చేసే నష్టానికి కూడా మామూలుగా ఉండదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates