మాజీ మంత్రి ఈటల రాజేందర్… ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన.. కారు దిగేసి.. కషాయం గూటికి చేరారు. ఈ క్రమంలో… ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై పలు విమర్శలు చేశారు. పలు రకాల ఆరోపణలుచేశారు. పార్టీ మారే క్రమంలో.. ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేయడం సహజమే అని అందరూ అనుకున్నారు. అయితే.. సడెన్ గా ఈ రోజు ఈటల పేరిట.. సీఎం కేసీఆర్ ని క్షమాపణలు అడుగుతూ.. ఆయనను ఆకాశానికి పొగిడేస్తూ.. ఓ లేఖ బయటకు వచ్చింది.
ఈ లేఖ చూసిన వారంతా అందరూ షాకయ్యారు. అరె.. మొన్నే కదా తిట్టాడు.. మళ్లీ ఇప్పుడు ఈ పొగడ్తలేంది అనుకున్నారు. కానీ.. అది నిజమైన లేఖ కాదని ఫేక్ అని తేలిపోయింది.తనను క్షమించాలని, ఈ ఒక్కసారికి తమ్ముడిగా భావించి వదిలిపెట్టాలని ప్రాధేయపడ్డట్లుగా ఆ లేఖలో ఉండటం గమనార్హం.
దీనిపై ఈటల పోలీసులకు కూడా కంప్లైట్ చేశారు. కానీ ఈ ఫేక్ లేఖలు అన్ని ఎక్కడనుండి వస్తున్నాయన్నది హాట్ టాపిక్ గా మారింది. కొందరు టీఆర్ఎస్ శ్రేణులే.. ఈ రకంగా లేఖలు క్రియేట్ చేసి.. ఈటలను ఫూల్ చేయాలని చూస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈటల పార్టీ మారే సమయంలో కేసీఆర్ పై ఆరోపణలు చేసినప్పుడు కూడా.. గతంలో ఈటల వీడియోలను చూపించి ట్రోల్ చేశారు. ఇప్పుడు.. టీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్.. ఇలా ఫేక్ లేఖలు క్రియేట్ చేసిందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఫేక్ లేఖ వెనక హస్తం ఎవరిదో.. పోలీసులే కనిపెట్టాలి.