టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. నారా లోకేష్.. ఏపీ సీఎం జగన్‌పై మళ్లీ నిప్పులు చెరిగారు. తనదైన సటైర్లతో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మరీ ముఖ్యంగా సీఎం జగన్ టార్గెట్‌గా వ్యాఖ్యలు సంధించారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైన సీఎం.. డాబు మాటలు చెబుతున్నారంటూ.. నిప్పులు చెరిగారు. “జాబు రెడ్డి.. డాబు మాటలు చెబుతున్నాడు” అంటూ.. ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్ -1 అభ్యర్థులు సీఎం జగన్ వైఖరిపై తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో గ్రూప్-1 విద్యార్థులతో నారా లోకేష్ తాజాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు… భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, యువతను నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్.. యువతను నిండా ముంచేశారని లోకేష్ వ్యాఖ్యానించారు. వలంటీర్ పోస్టులను కూడా రెగ్యులర్ పోస్టుల జాబితాలో చూపించడం మడమ తిప్పడం కాదా? అని ప్రశ్నించారు.
“వలంటీర్లు జీతాలు పెంచమని కోరినప్పుడు మీరు ఏం చెప్పారు. అవి ఉద్యోగాలు కావని.. కేవలం సేవాభావంతో కూడుకున్నవని.. చెప్పలేదా? ఇప్పుడు వాటిని కూడా రెగ్యులర్ పోస్టుల జాబితాలో చూపించి.. ఎవరి కళ్లకు గంతలు కట్టాలని భావిస్తున్నారు. మీ డాబు మాటలు నమ్మేందుకు యువత సిద్ధంగా లేరు. ఇప్పటికైనా ఇస్తామన్న ఉద్యోగాలు ఇవ్వండి. లేకపోతే.. యువత ఆగ్రహంతో మీ ప్రభుత్వం మధ్యలోనే కుప్పకూలడం ఖాయం” అని లోకేష్ తీవ్ర ఆగ్రహంవ్యక్తం చేశారు.
ఏపీపీఎస్సీ.. రాజ్యాంగబద్దమైన సంస్థ అని.. కానీ, ఇప్పుడు దానిని రాజకీయ పునరావాస కేంద్రంగా జగన్ మార్చేశారని.. వైసీపీలో కీలక నేతలను తీసుకువచ్చి.. ఏపీపీఎస్సీ బోర్డులో కూర్చోబెడితే.. ఇలానే ఉంటుందని.. వ్యాఖ్యానించారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఐదేళ్లలో వందల మంది ని ఏపీపీఎస్సీ ద్వారా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని లోకేష్ గుర్తు చేశారు. ఇలా మొత్తం ఐదేళ్లలో 5 లక్షల పైచిలుకు ఉద్యోగాలు కల్పించామని.. చెప్పారు. కానీ ఇప్పుడు అసలు నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండానే జగన్.. డాబు మాటలు చెబుతున్నారని.. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలండర్ ఇస్తామని చెప్పిన జగన్ రెండేళ్లపాటు నిద్రపోయారా? అని లోకేష్ ప్రశ్నించారు.
This post was last modified on June 21, 2021 2:10 pm
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…
గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…