దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ దేశాల ముందు చేతులు కట్టుకున్నారా? కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశారా? ఈ క్రమంలోనే ఏకంగా ఐక్యరాజ్యసమితి సైతం మోడీ నిర్ణయాన్ని ప్రశ్నించిందా? దీంతో ఆయన సమాధానం చెప్పక తప్పలేదా? అంటే.. తాజాగా జరిగిన పరిణామాలు ఔననే సమాధానమే ఇస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. దేశంలో సోషల్ మీడియా వేదికలుగా ఉన్న ట్విట్టర్, ఫేస్ బుక్.. సహా అనేక మాధ్యమాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, రెచ్చగొట్టడం, సమాజంలో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారనే కారణంగా.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త ఐటీ నిబంధనలు తీసుకువచ్చింది.
ఆ వెంటనే ట్విట్టర్‌పై కేంద్రం చర్యలు తీసుకుంది. ఇది గత వారం తీవ్ర విమర్శలకు దారితీసింది. ట్విట్టర్‌కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కూడా చోటు చేసుకుంది. దీంతో ఈ వివాదం ప్రపంచ దేశాల దృష్టికి చేరింది. ఆ వెంటనే కేంద్రం ప్రకటించిన కొత్త ఐటీ నిబంధనల పట్ల ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే “అసలు భారత్‌లో ఏం జరుగుతోందో చెప్పాలి?” అంటూ.. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి మోడీ ప్రభుత్వాన్ని నిలదీసింది. దీంతో తప్పని పరిస్థితిలో మోడీ ప్రభుత్వం ఐక్యరాజ్యసమితికి వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
సోషల్ మీడియా వేదికలు దుర్వినియోగం అవుతున్నట్టు పలు ఉదంతాలు వెలుగు చూడటంతో కొత్త ఐటీ నిబంధనలు తేవాల్సిన అవసరం ఏర్పడిందని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలికి మోడీ సర్కారు తాజాగా తెలిపింది. ఉగ్రవాదం, అశ్లీలత, ఆర్థిక అవకతవకలు, హింసను రెచ్చగొట్టడం వంటి నేరాలకు కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియా దోహదపడిందని కేంద్రం పేర్కొంది. ఐక్యరాజ్యసమితిలోని భారత్ పర్మెనెంట్ మిషన్ కి లేఖ రాసింది.
సోషల్ మీడియా సాధారణ వినియోగదారుల రక్షణ కోసం ఈ నిబంధనలు తెచ్చామని కేంద్రం ఈ లేఖలో పేర్కొంది. అంతేకాకుండా.. ‘సోషల్’ బాధితులు సమస్యలను పరిష్కరించేందుకు ఓ గ్రీవెన్స్ రిడ్రెసల్ వ్యవస్థ అవసరముందని కూడా అభిప్రాయపడింది. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం అవసరమైన వ్యవస్థలను నెలకొల్పాలన్న భారత సర్వోన్నత న్యాయస్థానం తీర్పులను కూడా కేంద్రం తన లేఖలో ప్రస్తావించింది. అయితే.. ఈ విషయంపై ఐక్యరాజ్యసమితి తీవ్రంగా స్పందిస్తే.. అంతర్జాతీయ మానవ హక్కుల బృందాన్ని భారత్‌కు పంపించే అవకాశం ఉందని.. మోడీ సర్కారు చెబుతున్న అంశాలపై అధ్యయనం చేయించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. గతంలో పాకిస్థాన్‌లోనూ ఇలానే జరిగితే.. ఐక్యరాజ్యసమితి తీవ్రంగా స్పందించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
This post was last modified on June 20, 2021 8:51 pm
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…