Movie News

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్ ఓకే ముద్ర వేశారు. అయినా సరే వసూళ్లు మాత్రం ఢోకా లేకుండా వస్తున్నాయి. ఉగాది పండగ సెలవు దినం కావడంతో థియేటర్ వినోదం కోరుకునే ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ కు మార్కెట్ లో ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ పవన్ మూవీనే. దురంధర్ రివెంజ్ ఎంత భీభత్సం చేస్తున్నా అది అడల్ట్ ఓన్లీ కంటెంట్ కావడం వల్ల పిల్లలు దూరంగా ఉన్నారు.

మాములుగా పవన్ మూవీ యావరేజ్ అనిపించుకున్నా చాలు బ్రేక్ ఈవెన్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంత పెద్ద డిజాస్టర్ అయిన అజ్ఞాతవాసి పేరు మీద ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో ఓపెనింగ్ డే రికార్డులు ఉన్నాయి. ఇక గబ్బర్ సింగ్, ఖుషి లాంటి వాటి గురించి చెప్పాల్సిన పని లేదు. వకీల్ సాబ్ ఎక్స్ ట్రాడినరి అనిపించుకోకపోయినా, సాధారణ టికెట్ రేట్లు ఉన్నా వంద కోట్ల దగ్గరకు వెళ్లడం చిన్న విషయం కాదు. సో మినిమమ్ సరుకు ఉంటే చాలు.

దర్శకుడు హరీష్ శంకర్ పెద్దగా రిస్క్ చేయకుండా కమర్షియల్ టెంప్లేట్ లో ఉస్తాద్ భగత్ సింగ్ ని రాసుకున్న వైనం స్పష్టం. తక్కువ టైంలో ఈ మాత్రం అవుట్ ఫుట్ తేవడం ఆషామాషీ కాదు. అన్ని వర్గాలను మెప్పించలేకపోవచ్చు కానీ ఫ్యాన్స్ కోరుకున్న వాటిని ఇవ్వడంలో మాత్రం విఫలం కాలేదు. ఒకవేళ పూర్తి స్థాయి టైం, వనరులు ఉంటే కనక గబ్బర్ సింగ్ మేజిక్ రిపీట్ అయ్యేదేమో. చాలా పరిమితుల మధ్య ఆయన పోరాడిన మాట వాస్తవం.

ఏ స్థాయికి ఉస్తాద్ భగత్ సింగ్ వెళ్తుందనేది కేవలం మొదటి రోజు వసూళ్లను బట్టి చెప్పలేం. సోమవారం వరకు ఆక్యుపెన్సీలు బాగుంటే కనక ఈజీగా హిట్టు స్టాంపు పడిపోతుంది. నిర్మాతలు మాత్రం సండేకి బ్రేక్ ఈవెన్ దాటేస్తాం అంటున్నారు. మొదటి రోజు కలెక్షన్ ఎంత ప్రకటిస్తారనేది రేపటికి తేలుతుంది. ఇవాళ్టిని మెయిన్ సెంటర్స్ దాదాపు హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఇదే జోరు వీకెండ్ వరకు కొనసాగుతుందో లేదో చూడాలి. దురంధర్ రివెంజ్ తెలుగు వెర్షన్ అంతకంతా లేట్ కావడం ప్లస్ అవుతోంది.

This post was last modified on March 19, 2026 10:47 pm

Share

Recent Posts

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

1 hour ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

1 hour ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

2 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

4 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

6 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

8 hours ago