ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైలెంట్.. రీజ‌నేంటి?

జ‌న‌సేన అధినేత… గ‌ళం విప్పితే నిప్పులు మూట‌క‌ట్టుకుని మాట‌లు పెల్లుబుకుతాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మైకు ముట్టుకుంటే.. మాట‌లు తూటాల్లా పేల‌తాయి. ఏపీ రాజ‌కీయాల్లో 2014లో అడుగు పెట్టిన ప‌వ‌న్‌.. జ‌న‌సేన పార్టీ ఏర్పాటుతో మార్పు తీసుకువ‌స్తానంటూ.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చారు. అయితే.. ఆ ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉన్న ప‌వ‌న్‌.. త‌ర్వాత ప‌రిమాణాల్లో టీడీపీకి మ‌ద్ద‌తుగా నిలిచారు. ప్ర‌భుత్వ ఏర్పాటు కోసం .. టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో క‌లిసి వేదిక పంచుకుని ఎన్నికల ప్ర‌చారం చేశారు. ఈ క్ర‌మంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగారు.

ముఖ్య‌మంత్రి కొడుకు ముఖ్య‌మంత్రి కావాల‌ని రాజ్యాంగంలో రాసుందా? అని ప్ర‌శ్నించారు. అవినీతి చేయ‌డం ఎంత నేర‌మో.. దానిని ప్రోత్స‌హించ‌డం కూడా అంతే నేర‌మ‌ని.. ఓట్ల ద్వారా ప్రోత్స‌హించినా.. ఇదే సూత్రం వ‌ర్తిస్తుంద‌ని.. తిరుప‌తి వేదిక‌గా.. జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో మాట‌ల తూటాలు పేల్చారు. ఇక‌, చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలోనూ ప‌వ‌న్ అనేక మార్లు ఏపీలో ప‌ర్య‌టించిన‌ప్పుడల్లా.. జ‌గ‌న్ టార్గెట్‌గానే రాజ‌కీయాలు చేశారు. వైసీపీ నేత‌లు విప‌క్షానికి కూడా ప‌నికిరార‌ని.. వ్యాఖ్యానించారు. కుట్ర‌లు, కుతంత్రాల‌తో న‌డిచే పార్టీగా వైసీపీని అభివ‌ర్ణించారు.

సీఎం కొడుకు అయినంత మాత్రాన ఎందుకు సీఎంను చేయాల‌ని నిల‌దీసిన ప‌వ‌న్‌.. కానిస్టేబుల్ కొడుకు గా త‌న‌కు సీఎం అయ్యేందుకు అన్ని అర్హ‌త‌లు ఉన్నాయ‌ని చెప్పుకొన్నారు. అంతేకాదు.. విశాఖ ఎయిర్ పోర్టులో జ‌గ‌న్‌పై జ‌రిగిన కోడిక‌త్తిదాడిపై కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. త‌న వాళ్ల‌తోనే దాడులు చేయించుకుని సానుభూతి కోసం ప్ర‌చారం చేసుకున్నార‌ని.. ఇలాంటి వారిని ఎందుకు న‌మ్మాలి? అని ప్ర‌శ్నించారు. అదేస‌మ‌యంలో వైసీపీ నేత‌ల‌పైనా విమ‌ర్శ‌లు గుప్పించారు. జ‌గ‌న్ చేసిన పాద‌యాత్ర‌ను ఎవ‌రూ న‌మ్మ‌బోర‌ని అన్నారు. “జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో ఒంట్లో కొవ్వు క‌రుగుతుందేమో.. కానీ, ప్ర‌జ‌ల మ‌న‌సు మాత్రం క‌ర‌గ‌దు!” అని క‌ఠిన వ్యాఖ్య‌లు సైతం చేశారు ప‌వ‌న్‌.

అయితే.. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. కొన్నాళ్లు బాగానే స్పందించిన ప‌వ‌న్‌.. మంత్రుల‌ను కూడా టార్గెట్ చేసిన జ‌న‌సేనాని.. త‌ర్వాత కాలంలో పూర్తిగా సైలెంట్ అయ్యారు. మ‌రీ ముఖ్యంగా బీజేపీతో ప‌వ‌న్ పొత్తు పెట్టుకోవ‌డం.. అనంత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో ప‌వ‌న్ వాయిస్ డౌన్ అయింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నారు. కొన్నాళ్ల కింద‌ట జ‌రిగిన తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో ప్ర‌చారం నిర్వ‌హించిన ప‌వ‌న్‌.. ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించినా.. అందులో ప‌స‌లేకుండా పోయింద‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్.. జ‌గ‌న్ పాల‌న‌పై ఇంత ఆచితూచి వ్య‌వ‌హ‌రించ‌డాన్ని గ‌మ‌నించిన విశ్లేష‌కులు.. ఎక్క‌డో ఏదో జ‌రుగుతోంద‌నే అనుమానాలు వ్య‌క్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌తో జ‌గ‌న్ త‌ర‌చుగా బేటీలు నిర్వ‌హిస్తుండ‌డం.. రాష్ట్ర ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్న కేంద్రం.. జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించేవారిని ముఖ్యంగా త‌మ పార్టీ నేత‌ల‌ను.. త‌మ‌కు అనుబంధంగా ఉన్న ప‌వ‌న్‌ను క‌ట్ట‌డి చేసింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ సూచ‌న‌ల‌తోనే ప‌వ‌న్ సైలెంట్ అయ్యార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. మ‌రి దీని వెనుక ఇంత‌కు మించింది ఏమైనా ఉందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. చూడాలి మ‌రి ఫ్యూచ‌ర్‌లో కూడా ఇలానే ఉంటారా? లేక‌.. త‌న‌దైన శైలిలో విజృంభిస్తారా? అనేది!