మాజీ మంత్రి ఈటల రాజేందర్ కి తృటిలో ప్రమాదం తప్పింది. బీజేపీలో చేరేందుకు ఈటల తన బృందంతో కలిసి ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా… ఈ రోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి తిరుగు ప్రయాణంలో ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.
అయితే.. ఫైలెట్ అలెర్ట్ అవ్వడంతో పెను ప్రమాదం తప్పి పోయింది. టేకాఫ్ సమయంలో రన్ వేపై సాంకేతిక సమస్యను పైలెట్ గుర్తించారు. గాల్లోకి లేచే సమయంలో సాంకేతిక సమస్యను పైలెట్ గుర్తించారు. ఢిల్లీ నుంచి ఈటల బృందం ప్రత్యేక విమానం బయలుదేరింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘనందన్, వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమాతో పాటు మొత్తం 184 మంది విమానంలో ఉన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates