ఆన్‌లైన్‌లో అనేక విషయాలపై సెర్చ్ చేస్తుంటారు. కానీ, కొన్ని మాత్రమే రికార్డు సృష్టిస్తాయి. ఇలాంటి వాటిలో మరోసారి.. ట్రెండింగ్‌లో ఉన్నారు ఏపీ సీఎం జగన్. దాదాపు మూడేళ్ల కిందట.. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఒకసారి.. జగన్ గురించి గూగుల్‌లో సెర్చ్ చేసిన వారు.. నిముషానికి 1000 మంది అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీనికి కారణం.. ఆయన ఎంచుకున్న సుదీర్ఘ పాదయాత్ర, ఆయనపై ఉన్న కేసులు. ఇక, ఆయన సీఎం అయిన తర్వాత కూడా ఇంతలా ఎవరూ వెతకలేదు.
ఇలా.. గూగుల్ సెర్చ్‌లో జగన్ ఎప్పుడూ ఒక రికార్డును సొంతం చేసుకుంటున్నారు. ఇదే విధానం ఇప్పుడు కూడా కొనసాగింది. తాజాగా జగన్ గురించి గూగుల్‌లో సెర్చ్ చేసిన వారు నిముషానికి 1000 మంది ఉన్నారని నెట్‌దిగ్గజం గూగుల్ పేర్కొంది. అయితే.. దీనికి రీజనేంటంటే తాజాగా జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. జగన్ ఢిల్లీ పర్యటనలో పోలవరం, మూడు రాజధానులు, ప్రత్యేక హోదాతో పాటు ఆయనపై ఉన్న కేసులు అనేక అంశాలు లింకప్ అయ్యి ఉన్నాయి. దీంతో జగన్ ఢిల్లీ పర్యటనపై ఆసక్తితో.. అనేక మంది సెర్చ్ చేశారని, ఢిల్లీలో జగన్ ఏం చేశారు? ఎవరిని కలిశారు? అనే విషయాలపై ఎక్కువ మంది వెతికారట.
అయితే.. గతంలోనూ సీఎం జగన్ డిల్లీకి అనేక మార్లు వెళ్లినా.. ఇప్పుడు ఎందుకు ఇంత ప్రాధాన్యం ఏర్పడిందనే విషయం కూడా ఆసక్తిగా మారింది. ప్రధాన కారణం పైన పేర్కొన్న అంశాలతో పాటు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామపై సీఐడీ రాజద్రోహం కేసు నమోదు చేయడం, ఆయనపై థర్డ్‌డిగ్రీ ప్రయోగించారనే విమర్శలు, ఇక, రఘురామ.. కేంద్రంలోని పెద్దలను కలిసి ఫిర్యాదు చేయడం.. అదే సమయంలో జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై మరో మూడు రోజుల్లో తీర్పు వెలువడనుండడం వంటి కీలక అంశాల నేపథ్యంలో జగన్ ఢిల్లీ టూర్‌లోఏం చేస్తున్నారనే ఆసక్తి.. నెటిజన్లలో పీక్ రేంజ్‌లో ఉందని.. అందుకే గూగుల్లో జగన్ గురించి భారీ ఎత్తున సెర్చ్ చేశారట.
Gulte Telugu Telugu Political and Movie News Updates