వైఎస్ షర్మిలకు సలహా ఇవ్వాలనుకుంటున్నారా?

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు వైఎస్ షర్మిల. త్వరలో కొత్త పార్టీ పేరును.. జెండా.. ఎజెండాను ప్రకటించనున్న ఆమె.. తాజాగా ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నారు. తెలంగాణ సమాజంలోని వారు తమ పార్టీకి ఏమైనా సలహాలు.. సూచనలు ఇవ్వాలనుకుంటే అందుకు వీలుగా వాట్సాప్ నెంబర్ ను షేర్ చేశారు. అంతేకాదు.. ఈమొయిల్ ఐడీని ఇచ్చారు. తెలంగాణలో రాజన్న సంక్షేమ పాలనను తీసుకురావటమే లక్ష్యమన్న షర్మిల.. అందుకు తగ్గట్లుగా తనకు సలహాలు ఇవ్వాలని కోరారు.

తనకు సలహాలు ఇచ్చేందుకు వీలుగా ఆమె 8374167039తో వాట్సాప్ ఏర్పాటు చేశారు. అంతేకాదు reach@realyssharmila.comకు మొయిల్ చేయొచ్చని పేర్కొన్నారు. తెలంగాణలోని యువత.. విద్యావంతులు..పేదలు.. మేదావులు.. లాయర్లు.. పారిశ్రామికవేత్తలు.. రాజకీయ విశ్లేషకులు తమ పార్టీకి సలహాలు ఇవ్వాలని.. సూచనలు చేయాలన్నారు.

మరి.. షర్మిల ఇచ్చిన ఓపెన్ ఆఫర్ కు ఎంత మంది ఏమేర స్పందిస్తారు? ఎన్ని సలహాలు.. సూచనలు ఇస్తారోచూడాలి. వచ్చే నెల 8న (వైఎస్ పుట్టిన రోజు సందర్భంగా) తెలంగాణలో తన పార్టీని అధికారికంగా ప్రకటించనున్న విషయం తెలిసిందే. పార్టీలోకార్యకర్తలకు పెద్ద పీట వేస్తామని చెప్పిన ఆమె.. కార్యకర్తల మాటే పార్టీ రాజ్యాంగంగా పేర్కొనటం గమనార్హం. షర్మిల నోటి నుంచి వచ్చిన ఈ మాట రానున్న రోజుల్లో ఎలా అమలు అవుతుందన్నది ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు.