నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు.. తమ సొంత పార్టీ అధినేత వైఎస్ జగన్ కి ఏదో ఒక తిప్పలు పెడుతూనే ఉన్నాడు. వైసీపీ గుర్తుపై గెలిచిన ఆయన కొద్దిరోజులకే ఆ పార్టీకి వ్యతిరేకంగా మారారు. జగన్ పై సంచలన కామెంట్స్ చేస్తూ.. పార్టీని ఏదో ఒక విషయంలో ఇరకాటం పెడుతూనే ఉన్నాడు.
ఈ క్రమంలో.. ఆయన ఏపీ సీఐడీ కేసులో ఇరుక్కున్నాడు. ఈ కేసు తర్వాతైనా రఘురామ సైలెంట్ అయిపోతాడని అందరూ అనుకున్నారు. కానీ.. ఆయన మరింత రివర్స్ అయ్యి.. జగన్ కి కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాడు. తాజాగా.. వివాదంలోకి జగన్ భార్య వైఎస్ భారతిని కూడా లాగారు. అంటే.. జగన్ సతీమణి వైఎస్ భారతి నేతృత్వంలో నడుస్తున్న సాక్షి టీవీ చానెల్ కు లీగల్ నోటీసు ఇచ్చారు.
రఘురామ కృష్ణమ రాజు తరఫున న్యాయవాది పీవీజీ ఉమేష్ చంద్ర ఈ నోటీసు జారీ చేశారు. తన పరువుప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా తనకు వ్యతిరేకంగా, న్యాయవిరుద్ధంగా పలు కథనాలు ప్రసారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆ నోటీసు ఇచ్చారు.
అందుకు గాను తనకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. ఇందిరా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్ పర్సన్ వైఎస్ భారతీరెడ్డికి తదితరులకు ఆ నోటీసు జారీ చేశారు.
ఆమెతో పాటు పాలకవర్గం డైరెక్టర్లకు కూడా ఆయన ఆ నోటీసు ఇచ్చారు. ఎడిటర్ ఇన్ చీఫ్ నేమాని భాస్కర్, కన్సల్టింగ్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాస రావు పేర్లతో కూడా ఆ నోటీసులు ఇచ్చారు తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ చెప్పడానికి ఆయన కొన్ని కథనాలను ఆయన ఉదహరించారు. మరి ఈ నోటీసులపై జగన్, సాక్షి టీవీ ఎలాంటి యాక్షన్ తీసుకోనుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates