కరోనా కల్లోలం గత కొద్దికాలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఇంటా బయట విమర్శల జల్లు కురుస్తున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారిని డీల్ చేయడం, ఈ సమయంలో ప్రజల సంక్షేమం విషయంలో ఆయన గ్రాఫ్ పడిపోయిందనే విశ్లేషణలు కూడా తెగ వచ్చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో డ్యామేజ్ కంట్రోల్ గేమ్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలుపెట్టారని అంటున్నారు. కరోనా కల్లోలం కొనసాగుతున్న తరుణంలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.122 తగ్గింది. ప్రతి ఏటా ఉంటే సంప్రదాయానికి భిన్నంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
చమురు కంపెనీలు ఎల్‌పీజీ రేట్లను ఇకపై 1, 15 తేదీల్లో సమీక్షిస్తాయన్న వార్తల నేపథ్యంలో తొలి రోజునే ఉపశమనం కలిగించే వార్త వచ్చింది. 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరపై రూ.122 తగ్గింది. అంతకుముందు మే 1 న వీటి ధర రూ.45.50 తగ్గింది. అయితే, 14.2 కిలోల సిలిండర్ ధరలో మార్పు లేదు. ప్రధాని మోడీ పాలనలో గత ఏడేళ్లలో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.809 కు పెరిగింది. 2014 మార్చి 1 న.. 14.2 కిలోల దేశీయ గ్యాస్ సిలిండర్ ధర రూ.410.5 గా ఉండగా.. ఇప్పుడు రూ.809 కు పెరిగింది. అయితే, తాజా నిర్ణయం ఉపశమనం కలిగించేదని పలువరు పేర్కొంటున్నారు.
దాదాపు గత ఏడాది అంతా సిలిండర్ ధర పెరుగుతూనే ఉంది. దేశీయ 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర డిసెంబర్ నుంచి రూ.215 పెరిగింది. డిసెంబర్ 1 న దాని ధర రూ.644 కు పెరిగింది. డిసెంబర్ 15 న రూ.50 పెరిగింది. ఫిబ్రవరి 4 న రూ.25 పెరిగి రూ.719 కి చేరుకుంనది. దీని తర్వాత ఫిబ్రవరి 15 న మళ్లీ సిలిండర్‌కు రూ.50 పెంచారు. ఫిబ్రవరి 25 న సిలిండర్‌కు రూ.25, మార్చి 1 న రూ.25 పెరుగడంతో సిలిండర్ ధర రూ.819 లకు చేరుకుంనది. ఏప్రిల్ 1 న రూ.10 తగ్గించారు. అయితే, ఈ పెరుగుదలపై భారీగా విమర్శలు వచ్చిన తరుణంలో ఈ మేరకు తగ్గించే నిర్ణయం తీసుకునేలా కేంద్రం చొరవ చూపిందని అంటున్నారు.
This post was last modified on June 3, 2021 6:58 am
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…