జ‌గ‌న్‌కు మోస్ట్ ఇంపార్టెంట్‌.. రెండేళ్ల పాల‌నే..!


ఏపీ సీఎం.. జ‌గ‌న్‌కు ఉన్న ఛాన్స్ కేవలం రెండేళ్లు..! వాస్త‌వానికి ఏ ప్ర‌భుత్వానికైనా కూడా ఐదేళ్ల పాల‌న అం ది వ‌స్తుంది. కానీ, ఇప్పుడున్న ప‌రిస్థితిలో అందునా.. ఏపీ వంటి కీల‌క రాజ‌కీయాలు జ‌రుగుతున్న రాష్ట్రంలో అధికార పార్టీకి ద‌క్కేవి కేవ‌లం 4 సంవ‌త్స‌రాలే అన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తీ ఉండ‌దు. గ‌త చంద్ర‌బాబు పాల‌న‌లోనూ చివ‌రి ఆరు మాసాలు ఆయ‌న ఎన్నిక‌ల వ్యూహాల‌కే ప‌రిమితం అయ్యారు. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్‌.. రెండేళ్ల పాల‌న పూర్తి చేసుకున్నారు. దీంతో మూడేళ్ల పాల‌న క‌ళ్ల‌ముందు క‌నిపిస్తోంది.

కానీ, వాస్త‌వ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. కేవ‌లం రెండేళ్లు మాత్ర‌మే జ‌గ‌న్‌కు చేతిలో ఉన్న అవ‌కాశంగా పేర్కొంటు న్నారు ప‌రిశీల‌కులు. ఈ రెండేళ్ల‌లోనే ఆయ‌న చేయాల్సినంతా చేయాలి. అదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు కూడా రాజ‌కీయంగా కాకుండా.. త‌న ప‌నితీరు ఆధారంగా స‌మాధానం చెప్పాలి. వాస్త‌వానికి ఇప్పుడు ప్ర‌తిప‌క్షం ఓట్ల రాజ‌కీయాల్లో ఓడిపోతున్నా.. మాట‌ల విష‌యంలోనూ.. చేత‌ల విష‌యంలోనూ.. ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. చంద్ర‌బాబు స‌హా ఆయ‌న కుమారుడు, నాయ‌కులు.. తీవ్ర‌స్థాయిలో జ‌గ‌న్‌పై విరుచుకుప‌డుతున్నారు.

ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ.. తిరుప‌తి ఎన్నిక‌లోనూ ప‌రాజ‌యం ఎదురైన త‌ర్వాత‌.. టీడీపీ ప‌రిస్థితి ఘోరంగా మారుతుంద‌ని.. ఆ పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపించేవారు కూడా క‌రువ‌వుతార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఈ ఓట‌ములు త‌మ‌కు కావ‌ని అనుకున్నారో.. లేక‌.. మాట తూ లక‌పోతే.. త‌క్కువ అయిపోతామ‌ని లెక్క‌లు వేసుకున్నారో.. తెలియ‌దు కానీ, దూకుడు మాత్రం త‌గ్గించలే దు. ఈ ప‌రిణామం.. వైసీపీని ఇరుకున పెడుతోంది. మ‌రోవైపు.. అప్పులు.. పెరుగుతున్న ద్ర‌వ్య‌లోటు వంటివి కూడా వైసీపీ స‌ర్కారుకు ఇప్పుడు ప్ర‌తిబంధకంగా మారుతున్నాయి.

మ‌రోవైపు.. వ్య‌తిరేక మీడియా భారీ ఎత్తున జ‌గ‌న్‌ను డైల్యూట్ చేసేందుకు ఉన్న అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుని ముందుకు సాగుతున్న తీరు కూడా ఎన్నిక‌ల స‌మ‌యానికి పార్టీకి ఇబ్బందిగా మారే అవ‌కాశం క‌నిపిస్తోంది. కొత్త‌గా నాయ‌కుల‌ను త‌యారు చేసుకుని ముందుకు సాగాలనే వ్యూహం మంచిదే అయిన‌ప్పటికీ.. పాత వారిని ఎలా దారిలో పెట్టుకోవాల‌నేది కీల‌కంగా మారిన విష‌యం.. ఇన్ని ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. వ‌చ్చే రెండేళ్లు మాత్ర‌మే.. వైసీపీకి కీల‌క‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌వైపు ప‌థ‌కాలు.. మ‌రోవైపు ప్ర‌తిప‌క్షాల మాట‌ల తూటాలు, వ్య‌తిరేక ప్ర‌చారం వంటివి త‌ట్టుకుని ఎలా ముందుకు సాగుతారో చూడాలి.