రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుప్రతుల విషయంలో జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా ? అంటే అవుననే సమాచారం. కోవిడ్ చికిత్సలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులన్నింటినీ ప్రభుత్వ పరిధిలోకి తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. దీనివల్ల కోవిడ్ చికిత్సలు, రోగుల వివరాలు, ఫీజుల వసూళ్ళు తదితరాలపై పారదర్శకత వస్తుందని ప్రభుత్వానికి హైకోర్టు గట్టిగా చెప్పింది.
హైకోర్టు ఆదేశాల ప్రకారం చూస్తే తొందరలోనే ప్రైవేటు ఆసుపత్రులను ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఇలాంటి ఉత్తర్వులు, గోవా, మహారాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన విషయం తెలిసిందే. కరోనా చికిత్సల విషయంలో రోగులను ప్రైవేటు ఆసుపత్రులు దోపిడి చేస్తున్నాయనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. అసలు మందేలేని కరోనా వైరస్ కు చికిత్సల పేరుతో చాలామంది నుండి రు. 20 లక్షలు, 30 లక్షలు కూడా వసూలు చేసిన, చేస్తున్న ఆసుపత్రులున్నాయి.
రాష్ట్రంలో ఎన్ని ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్ చికిత్సను అందిస్తున్నాయో కూడా ప్రభుత్వం దగ్గర సరైన లెక్కలు లేవన్న విషయం బయటపడింది. ఎందుకంటే కోవిడ్ రోగులకు చికిత్సల విషయంలో ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకోకుండానే వైద్యం చేసేస్తున్నారు. అనుమానం వచ్చో లేకపోతే ఆరోపణలు వచ్చినపుడు విజిలెన్సు అధికారులు దాడులు చేసినపుడు అసలు విషయం బయటపడుతోంది. తాజాగా హైకోర్టు సూచనలతో ఇలాంటి అనేక సమస్యలకు చెక్ పడినట్లవుతుంది.
ప్రైవేటు ఆసుపత్రులన్నింటినీ ప్రభుత్వ పరిధిలోకి తీసుకువస్తే చేరుతున్న రోగులు, చికిత్సలు చేయించుకుంటున్న రోగులు, డిస్చార్జవుతున్న రోగులు, ఆక్సిజన్ అవసరాలు, వసూలు చేస్తున్న ఫీజులు స్ట్రీమ్ లైనవుతుంది. మొత్తంమీద ప్రైవేటు ఆసుపత్రుల చికిత్స, వసూలు చేస్తున్న ఫీజుల విషయంలో జనాల్లో చాలా గొడవలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. హైకోర్టు సూచనను ప్రభుత్వం గనుక అమల్లోకి తెస్తే చాలా సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి.
This post was last modified on May 18, 2021 10:43 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…