ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో.. ఏపీ సీఎం జగన్.. పోటీ పడుతున్నారా ? కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. వ్యాక్సిన్ కొనుగోలు చేసేందుకు ప్రధాని మోడీ.. పెద్దగా నిధులు కేటాయించడం లేదు. నిజానికి బడ్జెట్ కేటాయింపుల్లో.. రు. 35 వేల కోట్లు కరోనా వ్యాక్సిన్‌కు మోడీ సర్కారు కేటాయించింది. కానీ, ఇప్పటి వరకు దీనిలో నుంచి రు. 4500 కోట్లు మాత్రమే ఆయన కేటాయించారు. అది కూడా రెండు కంపెనీలు వ్యాక్సిన్ తయారీకి ఆయన వీటిని కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఇక, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు బీమా ఉంటుందని చెప్పినా.. ఈ విషయంలోనూ కేవలం వైద్యులను మాత్రమే చేర్చి.. తప్పుకొన్నారు.
ఇక, ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా బాధితులు అల్లాడుతుంటే.. మరోవైపు.. రైతులకు ఫసల్ బీమా యోజన కింద.. 9.5 కోట్ల రైతుల ఖాతాల్లోకి రు. 19 వేల కోట్ల రూపాయలు జమ చేస్తున్నారు. దీంతో వ్యాక్సిన్‌కు ఈ నిదులు ఇవ్వొచ్చు కదా ? అనే కామెంట్లు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇక, ఏపీ సీఎం జగన్ కూడా ఇలానే వ్యవహరిస్తున్నారని నెటిజన్లు అంటున్నారు. వ్యాక్సిన్ కొనేందుకు రు. 1600 కోట్లు ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం దగ్గర నిధులు లేవని.. మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ, తాజాగా జగన్ కూడా రైతులకు వైఎస్సార్ రైతు భరోసా కింది నిధులు విడుదల చేశారు.
మరోవైపు.. వ్యాక్సిన్ బాధ్యత కేంద్రానిదేనని అంటున్నారు. దీంతో ఈ డబ్బులేవో.. వ్యాక్సిన్‌కు కేటాయించి.. కొనుగోలు చేయొచ్చు కదా.. ప్రజలు ప్రాణాలతో ఉంటేనే కదా.. జగన్ ఏ పథకం ప్రకటించి.. అమలు చేసినా.. ప్రయోజనం ఉంటుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేతప్ప.. ప్రజలు రోగాలతోను, కరోనా విలయంలోనూ అల్లాడుతుంటే.. ఏంటి ప్రయోజనం అంటున్నారు. గతేడాది లాక్‌డౌన్‌లో మోడీ పదే పదే ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ధైర్యం నింపారు. ఈ యేడాది మోడీ ఆ విషయంలో ఘోరంగా ఫెయిల్ అవుతున్నారు.
ఇక్కడ జగన్ కూడా బయటకు రావడం లేదు సరికదా ? కనీసం ప్రజల్లో ధైర్యం నింపేలా వ్యవహరించడం లేదని ? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈ కరోనా విషయంలో మోడీలాగానే చేతులు ఎత్తేస్తున్నారనే విమర్శలు కూడా ఎక్కువుగా ఎదుర్కొంటున్నారు.
This post was last modified on May 16, 2021 6:44 am
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…