ఒకవైపు కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు అవసరమైన టీకాలు రాష్ట్రాలకు అందటంలేదు. రాష్ట్రాలకు అవసరమైన టీకాల ఉత్పత్తిని పెంచటం సాధ్యం కాదని టీకాలు ఉత్పత్తిచేస్తున్న రెండు ఫార్మాకంపెనీలు చేతులెత్తేశాయి. ముందు 60 ఏళ్ళ వాళ్ళకి టీకాలన్నారు. తర్వాత 45 ఏళ్ళ వాళ్ళకి కూడా టీకాలు వేయాలన్నారు. ఎప్పుడైతే టీకాలు వేసే వయసును 60 నుండి 45కి తగ్గించారో అప్పటి నుండే టీకాల కొరత మొదలైపోయింది. ఈ నేపధ్యంలోనే 18 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా టీకాలు వేయొచ్చని కేంద్రం చెప్పి చేతులు దులిపేసుకుంది.
వాస్తవాలు ఇలాగుంటే ఉన్నతాధికారులతో సమీక్ష చేసిన నరేంద్రమోడి రాష్ట్రాల్లో ఎక్కడ కూడా టీకాలు వేయటంలో వేగం తగ్గించద్దని ఆదేశించటమే విచిత్రంగా ఉంది. దేశావసరాలకు సరిపడా టీకాలను ఉత్పత్తి చేయలేమని టీకాలు ఉత్పత్తి చేస్తున్న రెండు ఫార్మా కంపెనీలు చేతులెత్తేశాయి. మొత్తం టీకాల పంపిణిని కేంద్రం తన గుప్పిట్లోనే పెట్టుకున్నది. రాష్ట్రాలకు అవసరమైన టీకాలను రాష్ట్రాల నుండి ఇండెంట్లు తెప్పించుకుని కేంద్రమే ఫార్మాకంపెనీలతో మాట్లాడి సరఫరా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
ఇలాంటి నేపధ్యంలోనే టీకాల కొరత గొడవ ఒక్కసారిగా పెరిగిపోయింది. దాంతో అవసరమైన టీకాలను ఫార్మాకంపెనీలతో మాట్లాడుకోవాలని రాష్ట్రప్రభుత్వాలకు చెప్పిన కేంద్రం చేతులు దులిపేసుకుంది. ఫార్మాకంపెనీలతో రాష్ట్రప్రభుత్వాలు మాట్లాడినపుడు కేంద్రం ఇదివరకు పెట్టిన ఇండింటునే సరఫరా చేయలేకపోతున్నట్లు చెప్పాయి. కాబట్టి రాష్ట్రావసరాలకు సరిపడా టీకాలను అందించలేమని స్పష్టంగా చెప్పేశాయి. ఈ పరిస్ధితుల్లో 18 ఏళ్ళవాళ్ళకి టీకాలు వేయటాన్ని ప్రభుత్వాలు పక్కనపెట్టేశాయి.
ఈ విషయాలన్నీ నరేంద్రమోడికి బాగా తెలుసు. 45 ఏళ్ళు దాటినవారిలో 31 శాతం మందికి మాత్రమే టీకాలు వేయగలిగాయి. అంటే వ్యాక్సిన్ కొరత ఏ స్ధాయిలో ఉందో దీన్నిబట్టి అర్ధమైపోతోంది. ఇలాంటిస్ధితిలో అందరికీ టీకాలు వేయాలని మోడి రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించటంలో అర్ధమేలేదు. అందరికీ టీకాల కార్యక్రమం విఫలమయ్యిందటేనే అందుకు కారణం నరేంద్రమోడి. తన వైఫల్యాన్ని అంగీకరించటానికి ఇష్టపడని మోడి దాన్ని రాష్ట్రప్రభుత్వాల మీదకు తోసేస్తున్నారు. ఇక్కడే మోడి డబల్ గేమ్ జనాలకు అర్ధమైపోతోంది.
This post was last modified on May 7, 2021 12:13 pm
ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…
అదేంటి.. అనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్రబాబు వెనక్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారా?…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…
వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై సినీ నటుడు,వైసీపీ నేత పోసాని కృష్ణ ముురళి సంచలన వ్యాఖ్యలు చేసిన…
భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను ఉత్తమ…