Movie News

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో కామెడీ హిట్స్ అందించిన దర్శకుడు ప్రియదర్శన్‌తో మళ్లీ కలవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ‘భూత్ బంగ్లా’ టీజర్ విడుదలైంది. హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ చూస్తుంటే, పాత అక్షయ్ మళ్ళీ గుర్తొస్తున్నాడు. కానీ, ప్రస్తుత ట్రెండ్‌లో ఈ రొటీన్ హారర్ కామెడీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందనేది అసలు ఛాలెంజ్.

​టీజర్ విషయానికి వస్తే, ఒక పాత బంగ్లాలోకి అక్షయ్ అండ్ గ్యాంగ్ అడుగుపెట్టడం.. అక్కడ ఎదురయ్యే వింత అనుభవాలను కామెడీగా చూపించే ప్రయత్నం చేశారు. అక్షయ్ తనదైన మార్కు టైమింగ్‌తో నవ్వించడానికి ట్రై చేశాడు. ముఖ్యంగా పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్ వంటి సీనియర్ కమెడియన్లు తోడవడంతో వినోదానికి లోటుండదని అర్థమవుతోంది. అయితే, టీజర్‌లో చూపించిన కొన్ని సీన్లు పాత సినిమాలనే గుర్తు చేస్తున్నాయి. అప్పట్లో ‘భూల్ భులయ్యా’ సృష్టించిన మ్యాజిక్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుందా లేదా అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది.

​దర్శకుడు ప్రియదర్శన్ మేకింగ్ స్టైల్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. సిచ్యువేషనల్ కామెడీని ఆయన బాగా పండిస్తారు. ఈ సినిమాలో కూడా అదే నమ్ముకున్నట్లు టీజర్ చూస్తే క్లియర్‌గా తెలుస్తోంది. అక్షయ్ కుమార్ ఒకప్పుడు ఇలాంటి పాత్రల్లో అదరగొట్టేవాడు. కానీ ఈ మధ్య చేసిన చాలా సినిమాలు నిరాశపరిచాయి. అందుకే ఈ ‘భూత్ బంగ్లా’పై అక్షయ్ చాలా ఆశలు పెట్టుకున్నారు. టబు, వామికా గబ్బి వంటి నటీనటులు ఉండటం సినిమాకి కొంత గ్లామర్ అండ్ యాక్టింగ్ వెయిట్ పెంచుతోంది.

​ముఖ్యంగా ఈ సినిమాలో గ్రాఫిక్స్ హారర్ ఎలిమెంట్స్ కొంచెం పాతకాలపు పద్ధతిలో ఉన్నట్లు అనిపిస్తోంది. ఈమధ్య కాలంలో ముంజ్యా, స్త్రీ 2 వంటి సినిమాలు హారర్ కామెడీ జోనర్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయి. వాటితో పోలిస్తే ప్రియదర్శన్ మార్క్ కామెడీ ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తుందా లేక రిఫ్రెషింగ్‌గా ఉంటుందా అన్నదే పెద్ద ప్రశ్న. ఏప్రిల్ 10న ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది. సమ్మర్ హాలిడేస్‌ని టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఏ మేరకు థియేటర్లకు రప్పిస్తుందో చూడాలి.

​అయితే ‘భూత్ బంగ్లా’ టీజర్ ఒక మోస్తరుగా ఉన్నప్పటికీ, అక్షయ్ ఫ్యాన్స్ మాత్రం తమ ఫేవరెట్ హీరో మళ్ళీ కామెడీ ట్రాక్ ఎక్కినందుకు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ప్రియదర్శన్ తన పాత మ్యాజిక్‌ని మళ్ళీ చూపిస్తాడని గట్టిగా నమ్ముతున్నారు. అక్షయ్ కుమార్ కామెడీ ఇప్పుడు పండాలంటే కథలో కొత్తదనం కూడా ఉండాలి. కేవలం రాజ్‌పాల్ యాదవ్ వింత చేష్టలు, అక్షయ్ వెటకారపు మాటలు ఉంటే సరిపోదు. మరి ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద మళ్ళీ తన సత్తా చాటుతుందో లేదో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

This post was last modified on March 12, 2026 3:10 pm

Share

Recent Posts

కోటి పారితోష‌కం గురించి మౌళిని అడిగితే…

గ‌త ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమాతో సంచ‌ల‌నం రేపాడు యువ న‌టుడు మౌళి. సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స‌ర్‌గా ప్ర‌యాణం మొద‌లుపెట్టిన…

56 minutes ago

రాజ‌మౌళి మ‌హాభార‌తం క‌ల ఈ నిర్మాత నిజం చేస్తాడా?

త‌న డ్రీమ్ ప్రాజెక్టు మ‌హాభారతం అని చాలా ఏళ్ల కింద‌ట్నుంచే చెబుతున్నాడు దర్శ‌క ధీరుడు రాజ‌మౌళి. ఆయ‌న ఆ సినిమా…

59 minutes ago

పులివెందులలో జగన్ కొత్త సినిమా చూస్తారా?

ఔను... పులివెందులలో జగన్ కు కొత్త సినిమా చూపిస్తామంటున్నారు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ. ఒకప్పుడు జగన్ కోసం ప్రాణాలు…

2 hours ago

జనసేన – బీజేపీ అంతర్గత పొత్తు?

తెలంగాణ‌లో పోటీ చేసి తీరుతామ‌ని ప్ర‌క‌టించిన జ‌న‌సేన‌.. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టిందా? రంగంలోకి దిగేందుకురెడీ అయిందా? అంటే…

2 hours ago

సూర్య ‘సీన్’ ఇంత గప్‌చుప్ ఎందుకుంది

ఒకే ఏడాదిలో మూడు థియేటర్ రిలీజులిస్తున్న స్టార్ హీరోగా సూర్య 2026లో పెద్ద ఘనతనే అందుకోబోతున్నాడు. కరుప్పు / వీరభద్రుడుతో…

3 hours ago

రావణుడికి సీతమ్మ సర్టిఫికెట్ ఇవ్వడమేంటి

ఇంకొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 లో సీతగా నటించిన సాయిపల్లవి మీద చాలా కళ్లున్నాయి. తను…

5 hours ago