హైదరాబాద్ నుంచి ఢిల్లీ టికెట్ రూ.6వేలు వరకు ఉంటుంది. మరి.. హైదరాబాద్ నుంచి దుబాయ్ టికెట్ ధర ఎంత ఉంటుంది? సాధారణ రోజుల్లో రూ.7వేలకు వచ్చేస్తుంది. ఒక వెయ్యి అటు ఇటు తప్పించి మరి మార్పు ఉండదు. అందుకు భిన్నంగా ఇప్పుడు హైదరాబాద్ నుంచి దుబాయ్ వచ్చేందుకు రూ.40వేలు చెల్లిస్తే తప్పించి టికెట్ దొరకని పరిస్థితి నెలకొంది. ఎందుకిలా? అంటే.. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులేని చెప్పాలి.
తాజాగా పెరిగిపోతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో భారత విమానాలపై దుబాయ్ నిషేధాన్ని ప్రకటించింది. ఆదివారం నుంచి ఈ బ్యాన్ అమలు కానుంది. దీంతో.. శనివారం వరకు ఫ్లైట్ టికెట్ల ధరలకు రెక్కలు వచ్చాయి. దీనికి కారణం.. అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమేనని చెబుతున్నారు. ఏడాదిగా నడుస్తున్న కరోనా రచ్చతో దుబాయ్ లో ఉన్న భారతీయులు పెద్ద ఎత్తున అక్కడే ఉండిపోయారు. తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపించలేదు.
కేసుల తీవ్రత తగ్గినప్పటి నుంచి రాకపోకలు ఎక్కువ అయ్యాయి. అది.. ఈ మధ్యన మరింత పెరిగాయి. అంతలోనే కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోవటంతో.. కాస్త జోరు తగ్గిన తర్వాత దుబాయ్ కు వెళదామని భావించారు. కానీ.. దుబాయ్ సర్కారు భారత్ నుంచి వచ్చే వారి విషయంలో తీవ్ర ఆంక్షల్ని విధించింది. భారత్ నుంచి వచ్చిన వారు పది రోజులు క్వారంటైన్ లో ఉండాలని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఆదివారం నుంచి భారత్ నుంచి దుబాయ్ కు ఫ్లైట్లను అనుమతించకూడదని నిర్ణయించింది.
దీంతో.. సెలవుల మీద దేశానికి వచ్చిన వారిలో కొత్త గుబులు మొదలైంది. ప్రస్తుతానికి పది రోజులు ట్రావెల్ బ్యాన్ విధించిన దుబాయ్.. కేసుల సంఖ్య మరింత పెరిగితే.. నిషేధం మరింతకాలం కొనసాగించే వీలుందన్న సందేహాలు ఎక్కువ అయ్యాయి. అంతకాలం ఇండియాలోనే ఉండిపోతే.. ఉద్యోగానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దీంతో.. ఎవరికి వారు ఎంత ధర అయినా టికెట్ బుక్ చేసుకొని వెళ్లేందుకు తహతహలాడారు. దీంతో.. రూ.7వేలు ఉండాల్సిన ఫ్లైట్ టికెట్ ఏకంగా రూ.40వేలకు చేరుకుంది. ఇదిలా ఉంటే.. దుబాయ్ లో వైద్య సేవలకు వెళ్లే వారు కొత్త విధానాన్ని అనుసరిస్తున్నారు. అలాంటి వారిలో ఐదారుగురు కలిసి చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్లటం.. అక్కడి నుంచి తిరిగి రావటం ఈ మధ్యన ఎక్కువైనట్లుగా చెబుతున్నారు.
This post was last modified on April 25, 2021 10:01 am
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…