ఇటీవల కాలంలో తీవ్ర వివాదాస్పద మంత్రిగా గుర్తింపు పొందిన దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కు ఇప్పడు మరో సెగ తగిలింది. రెండు రోజుల కిందట.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వ్యాపారులు.. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గం అభివృద్ధికి ఏం చేశారంటూ.. వారు ప్రశ్నించారు. అంతేకాదు.. మంత్రిగారికి కొన్ని ప్రశ్నలు అంటూ.. సోషల్ మీడియాలో వంద ప్రశ్నలు సంధించారు. వీటిలో ప్రధానంగా.. కీలకమైన విజయవాడ వన్ టౌన్‌లోని రహదారుల విస్తరణ, వ్యాపారులు కడుతున్న జీఎస్టీ పరిధిని తగ్గించడం.. రాష్ట్రం వేస్తున్న పన్నులను తగ్గించడం వంటివి వారు ప్రశ్నిస్తున్నారు.
గత ఎన్నికల సమయంలోనూ ఇవే ప్రశ్నలు వారి నుంచి వచ్చాయి. అయితే.. అప్పట్లో వీటిని తాను తీరుస్తానంటూ.. వెలంపల్లి హామీ ఇచ్చారు.కానీ, ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్యపైనా.. ఆయన దృష్టి పెట్టలేదు. కేవలం తాను నివసిస్తున్న వన్‌టౌన్‌లోని గోశాల రోడ్డును మాత్రమే సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసుకున్నారని.. మిగిలిన రహదారులను అస్సలు పట్టించుకోవడం లేదని ఇక్కడి వ్యాపారుల మాట. ఇక, బంగారం వ్యాపారం ఎక్కువగా సాగే.. ఈ ప్రాంతంలోని వ్యాపారులకు పోలీసుల నుంచి వేధింపులు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో గతంలోనే వారు అనేక విధాలుగా వేధిస్తున్న తమకు రక్షణ కల్పించాలని మంత్రిని వేడుకున్నారు. ఇప్పటి వరకు ఈ సమస్యను మంత్రి పరిష్కరించలేక పోయారు. ఇక, భవానీ పురం అభివృద్ధి, విద్యాధరపురంలో రహదారుల వెడల్పు వంటి సమస్యలను కూడా మంత్రి పెడచెవిన పెట్టారని.. ఇక్కడి జనాలు ఆరోపిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడి అభివృద్ధి అక్కడే నిలిచిపోయిందనేది వ్యాపార వర్గాల ఆరోపణ. దీనికి తోడు ఇటీవల విజయవాడ వైశ్య వర్గం వారు ఓ సమావేశానికి తమ వర్గం నేత అని ఆహ్వానిస్తే దానికి కూడా ఆయన కావాలనే వెళ్లలేదని వారంతా మండిపడుతున్నారు. ఆ మాటకు వస్తే వైశ్యం వర్గంలో గతంలో మంత్రులుగా ఉన్న వారు రాష్ట్ర స్థాయిలో తమ వర్గం వారికి కావాల్సిన పనులు చేసి.. ఆ సమాజానికి బాగా ఉపయోగపడ్డారు.
కానీ వెళ్లంపల్లి ఈ విషయంలో వారిని పూర్తిగా డిజప్పాయింట్ చేశారు. ఇక అటు తన శాఖా పరంగా కూడా ఆయనకు మంచి మార్కులు లేవనే పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఏదేమైనా వెల్లంపల్లికి వరుసగా ఏదో ఒక సెగ తప్పడం లేదు. ఇక ఇలాంటి పెర్పామెన్స్‌తో ఆయన మంత్రి వర్గ ప్రక్షాళనలో తన పదవిని ఎంత వరకు నిలుపుకుంటారు ? అన్నది కూడా చెప్పలేని పరిస్థితి.
This post was last modified on April 15, 2021 9:59 am
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…
అదేంటి జెనీలియా ఎప్పుడో వివాహ బంధంలో అడుగు పెట్టింది కదాని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ తన గురించి కాదు. ఆరంజ్ ఫ్లాష్…
టాలీవుడ్ కే కాదు మొత్తం అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కౌంట్…
విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో…