వెనుకా ముందు చూసుకోకుండా తమ రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడే నేతలు కొందరు ఉంటారు. ఆ కోవలోకి వస్తారు ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్. ఆయన మీడియా ముందుకు వస్తే చాలు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంటారు.
తాజాగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన వేళ ఆయన మరోసారి నోరు విప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పై సంచలన విజయాన్ని నమోదు చేసిన గ్రంధి.. అవకాశం వచ్చిన ప్రతిసారీ పవన్ పై తీవ్రంగా విరుచుకుపడుతుంటారు.
తాజాగా వెల్లడైన ఫలితాల నేపథ్యంలో మాట్లాడిన గ్రంధి.. పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు. ‘‘విడాకులు తీసుకొని ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చు. కానీ రాజకీయాల్లో అలా కుదరదు. ఇక్కడ విలువలు.. సిద్ధాంతాలు ఉంటాయి. నిన్న.. మొన్నటిదాకా కమ్యూనిస్టు పార్టీలను పవన్ మోసం చేశారు. టీడీపీతో కలిసి విడిపోయి.. బీజేపీతో కలిసి లోపాయికారిగా కింద స్థాయి టీడీపీతో కలిసి పని చేస్తున్నారు. బాబు.. పవన్ నీచ రాజకీయాలను ప్రజలు రిజెక్టు చేశారు’’ అంటూ మండిపడ్డారు.
మూడు పెళ్లిళ్లు.. మూడుపార్టీలతో పొత్తు అంటూ గ్రంధి తీసుకొచ్చిన పోలిక పై జనసైనికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తనను ఎప్పుడు పడితే అప్పుడు వెనుకా ముందు చూసుకోకుండా చురకలు అంటించే గ్రంధిపై పవన్ రియాక్షన్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates