కాగ్ కొర‌డా… ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాదు.. అప్పుల ప్ర‌దేశ్‌!!

కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్‌(కాగ్‌). స్వ‌యంప్ర‌తిప‌త్తి క‌లిగిన ఆర్థిక సంస్థ‌. ప్ర‌జా ధ‌నాన్ని ఏ రాష్ట్రం ఏవిధంగా ఖ‌ర్చు చేస్తోంది? పాల‌కులు ఆర్థిక విష‌యాల్లో ఎలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు? రాష్ట్రాలు అభివృద్ధి బాట‌లో ఎలా ప‌య‌నిస్తున్నాయి? వ‌ంటి కీల‌క అంశాల‌పై ప్ర‌తి ఆర్థిక సంవ‌త్స‌రం ఎండింగ్‌లోనూ నివేదిక‌లు ఇస్తూ.. ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల లోగుట్ల‌ను, ఆర్ధిక విచ్చ‌ల‌విడి త‌నాన్ని ఎత్తి చూపుతూ.. ప్ర‌జాధ‌నం వినియోగంపై ప‌రిపూర్ణ‌మైన నివేదిక అందించ‌డ‌మే కాగ్ ప్ర‌ప్ర‌థ‌మ క‌ర్త‌వ్యం. ఈ సంస్థ‌కు త‌న‌-ప‌ర బేధాలు ఉండ‌వు. పాల‌కులు ఎవ‌రైనా.. ప్ర‌భుత్వం ఏదైనా.. ఉన్న‌ది ఉన్న‌ట్టు కుండ‌బ‌ద్ద‌లు కొట్ట‌డ‌మే ప‌ని!

ప్ర‌స్తుతం ఏపీలో జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పాల‌న‌, ఆయ‌న అనుస‌రిస్తున్న ఆర్థిక విధానాలు, ఆయ‌న చేస్తున్న ప్ర‌జాధ‌న వ్య‌యం వంటి కీల‌క విష‌యాల‌పై తాజాగా కాగ్ నివేదిక అందించింది. ఈ నివేదికలో ప్ర‌త్య‌క్షంగా పేర్కొన‌క పోయినా.. ప‌రోక్షంగా మాత్రం జ‌గ‌న్ స‌ర్కారు చేస్తున్న దుబారా వ్య‌యంతోపాటు.. అప్పులను ప్ర‌ధానంగా ప్ర‌స్తావించింది. “ఇలా అయితే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.. అప్పుల ప్ర‌దేశ్‌”గా మారిపోతుంద‌ని నిష్క‌ర్ష‌గా హెచ్చ‌రించింది. మ‌రి ఆ విశేషాలు.. హెచ్చ‌రిక‌లు ఓ లుక్కేద్దామా?!

  • జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇటీవ‌ల 10 నెల‌ల కాలానికి తీసుకున్న రుణం రూ.73913 కోట్లకు చేరింది.
  • ఇది.. బడ్జెట్‌ అంచనా రూ.48295 కోట్లకన్నా.. 153 శాతం ఎక్కువ
  • ఆర్థిక వ్య‌వ‌హారాల్లో రెవెన్యూ లోటు భారీగా పెరిగిపోతోంది. ఇది 300 శాతం అధికం
  • బడ్జెట్‌లో రెవెన్యూ లోటు అంచనా రూ.18,434 కోట్లు ఉండగా.. వాస్త‌వ‌ రెవెన్యూ లోటు రూ.54,046 కోట్లు
  • విచ్చ‌ల‌విడిగా అమ‌లు చేస్తున్న‌ సంక్షేమ కార్యక్రమాలతో అప్పుల ఊబిలో ఏపీ చిక్కుకుంది.
  • గతేడాది జనవరి నెలాఖరు వరకు అప్పులు రూ.46,503 కోట్లు
  • బహిరంగ మార్కెట్‌ రుణాల సేకరణలో ఏపీకి దేశంలో 4వ స్థానం
  • అప్పులు చేసి కూడా అభివృద్ధి చేయ‌డం లేదు.
  • మార్కెట్ రుణ‌ సేకరణతో పాటు ఏపీ ప్రభుత్వం మూడు మార్గాల ద్వారా రుణాలు తీసుకుంది.
  • డిసెంబర్‌లో 30 రోజుల పాటు స్పెషల్ డ్రాయింగ్స్, 26 రోజుల పాటు చేబదుళ్లు, మూడు రోజుల పాటు ఓవర్ డ్రాప్ట్‌కు వెళ్లారు.
  • ప్రస్తుతం ఏపీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది