వర్తమాన రాజకీయ వ్యవహారాలపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో దారుణం చోటు చేసుకుం ది. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ విష్ణువర్ధన్ రెడ్డిని లైవ్‌లోనే చెప్పుతో కొట్టిన ఘటన రాజకీయంగా సంచలనం సృష్టిస్తోం ది. తాజాగా లైవ్‌లో జరిగిన ఈ ఘటనపై బీజేపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వ కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ క్రమంలో జగన్ సర్కారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఈ నిర్ణయాల్లో రాజధాని నిర్మాణాలను కొనసాగించాలనేది కూడా ఒకటి. ఈ నేపథ్యంలో కేబినెట్ నిర్ణయాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మంగళవారం రాత్రి 7.30 గంటలకు డిబేట్ ప్రారంభించింది. ఈ డిబేట్‌కు బీజేపీ నేత.. విష్ణువర్ధన్ రెడ్డి నేరుగా హైదరాబాద్‌లోని స్టూడియోకు వచ్చారు. అదేసమయంలో ఏపీ పరిరక్షణ సమితి.. అధ్యక్షుడు కొటికలపూడి శ్రీనివాస్ తదితరులు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో రాజధాని నిర్మాణానికి బీజేపీ చేసింది ఏమీ లేదని కొటికల పూడి విమర్శించారు. దీనికి విష్ణువర్ధన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య వాదన కొనసాగింది. నువ్వు టీడీపీ ఏజెంట్‌గా మాట్లాడుతున్నావు. ఏపీ పరిరక్షణ సమితిని ఎత్తేసి.. పార్టీలో చేరిపో
అంటూ.. విష్ణువర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కొటికలపూడి శ్రీనివాస్ సంయమనం కోల్పోయి.. కాలి చెప్పుతో పక్కనే కూర్చున్న విష్ణువర్ధన్‌రెడ్డిని కొట్టబోయారు. అయితే.. అందకపోవడంతో బలంగా విసిరారు. ఈ క్రమంలో కొంత తప్పించుకున్నప్పటికీ.. విష్ణవర్ధన్‌రెడ్డి కుడి భుజానికి చెప్పు బలంగా తగిలి కిందపడింది. దీంతో వెంటనే లైవ్‌ను కట్ చేశారు.
ఇదిలావుంటే.. ఈ ఘటనపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిబేట్ అంటే అన్ని విషయాలు చర్చకు వస్తాయి. అలాంటి సమయంలో సంయమనం కోల్పోయి.. మాట్లాడడం.. భౌతిక దాడులకు దిగడం ఏంటని నిప్పులు చెరుగుతున్నారు. ప్రస్తుతం లైవ్ నిలిచిపోయింది. విషయం రాజకీయంగా తీవ్ర రూపం దాల్చడంతో ఏబీఎన్ ఎండీ ఆర్కే రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. మరి ఈ ఘటన ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
This post was last modified on February 23, 2021 10:27 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…