ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆంధ్ర హక్కుల గురించి మాట్లాడినంతనే గుర్తుకు వచ్చే చలసానికి తీరని విషాదం కమ్మేసింది. ఆయన కుమార్తె శిరిష్మ తాజాగా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఉదంతం షాకింగ్ గా మారింది. హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఉదంతం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి జరిగిన ఈ ఉదంతం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది.
గచ్చిబౌలికి దగ్గర్లోని ఓయూ కాలనీలో ఆమె నివిస్తుంటారు. 27 ఏళ్ల శిరిష్మకు 2016లో గ్రానైట్ వ్యాపారి సిద్ధార్థ్ తో వివాహమైంది. వారికి పిల్లల్లేరు. ఇంటీరియర్ డిజైనర్ అయిన ఆమె.. ఇటీవల కాలంలో తీవ్రమైన డిప్రెషన్ కు గురైనట్లుగా చెబుతున్నారు. పిల్లలు లేరన్న వేదనతో ఆమె ఫ్యాన్ కు ఉరి వేసుకొని మరణించినట్లుగా చెబుతున్నారు. ఫ్లాట్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకొన్న శిరిష్మను చూసిన ఆమె భర్త వెంటనే ఆమెను దగ్గర్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే ఆమె మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. చలసాని శ్రీనివాస్ కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. ఆత్మహత్య చేసుకునేంత వేదన ఆమెకు ఎందుకు ఎదురైందన్నది ఇప్పుడు సంచలన అంశంగా మారింది.
This post was last modified on February 19, 2021 10:52 am
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…