Movie News

విశాల్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా

ర‌వితేజ‌, నాని, అల్ల‌రి న‌రేష్, రాజ్ త‌రుణ్‌ లాంటి చాలామంది టాలీవుడ్ హీరోలు ముందు ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేసిన వాళ్లే. సీరియ‌స్‌గా ద‌ర్శకులు కావాల‌న్న ల‌క్ష్యంతోనే వాళ్లా విభాగాల్లో ప‌ని చేశారు. కానీ అనుకోకుండా న‌ట‌న‌లోకి వ‌చ్చారు.‌ టాలీవుడ్లోనే కాదు..కోలీవుడ్లో కూడా ఇలాంటి హీరోలు లేక‌పోలేదు. వారిలో తెలుగువాడైన విశాల్ ఒక‌డు.

విశాల్ అన్న విక్ర‌మ్ హీరో కావాల‌నుకుంటే.. విశాలేమో ద‌ర్శ‌కుడు కావాల‌న్న ల‌క్ష్యంతో ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చాడు. కొంత కాలం అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేసి అనుకోకుండా ఇత‌ను హీరో అయిపోయాడు. విక్ర‌మ్ నిర్మాణంలోకి వెళ్లిపోయాడు. తాను ఏదో ఒక రోజు ద‌ర్శ‌క‌త్వం చేప‌డ‌తాన‌ని చాలా ఏళ్ల నుంచి విశాల్ చెబుతూనే ఉన్నాడు. గ‌త ఏడాది అనుకోకుండా అత‌ను మెగా ఫోన్ ప‌ట్టేశాడు.

త‌న హిట్ మూవీ తుప్ప‌రివాల‌న్ (తెలుగులో డిటెక్టివ్‌) సీక్వెల్ నుంచి ఉన్న‌ట్లుండి ద‌ర్శ‌కుడు మిస్కిన్ తప్పుకోవ‌డంతో విశాల్ మిగ‌తా సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమా పూర్త‌య్యాక మ‌రో చిత్రంతో తాను పూర్తి స్థాయి ద‌ర్శ‌కుడిగా మార‌నున్న‌ట్లు విశాల్ తాజాగా వెల్ల‌డించాడు. విశాల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఇరుంబు తిరై (తెలుగులో అభిమ‌న్యుడు) చిత్రానికి సీక్వెల్ రానుంద‌ని, దాన్ని త‌నే డైరెక్ట్ చేస్తాన‌ని విశాల్ వెల్ల‌డించాడు. త‌న కొత్త చిత్రం చ‌క్ర.. అభిమ‌న్యుడుకు సీక్వెల్ అని చాలామంది అనుకుంటున్నార‌ని, కానీ అది నిజం కాద‌ని, ఇది పూర్తిగా వేరే క‌థ‌తో తెర‌కెక్కిన చిత్ర‌మ‌ని విశాల్ తెలిపాడు.

త‌న మిత్రుడు ఆర్య‌తో క‌లిసి చేస్తున్న ఎనిమీ చాలా బాగా వ‌స్తోంద‌న్న విశాల్.. త్వ‌ర‌లోనే శ‌ర‌వ‌ణ‌న్ అనే ల‌ఘు చిత్ర ద‌ర్శ‌కుడితోనూ ఓ సినిమా మొద‌లుపెట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించాడు. చ‌క్ర శుక్ర‌వార‌మే త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

This post was last modified on February 19, 2021 9:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

42 minutes ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

1 hour ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

2 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

2 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

3 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

6 hours ago