Political News

బొద్దింకల నాయకుడి తండ్రికి అంత డబ్బు ఎక్కడిది?

కేంద్ర ప్ర‌భుత్వాన్ని త‌న‌దైన శైలిలో ఇరుకున పెట్టి, కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేసే వ‌ర‌కు విశ్ర‌మించ‌ని .. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు.. అభిజిత్ దీప్కేకు ఉచ్చు బిగిస్తోంది. కొంద‌రు అనుమానించిన‌ట్టుగానే.. ఆయ‌న‌పై ఇప్పుడు విమ‌ర్శ‌లు, విచార‌ణ‌ల‌కు డిమాండ్ చేస్తూ.. మ‌హారాష్ట్ర‌కు చెందిన బీజేపీ సానుభూతి ప‌రుడు ఒక‌రు స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద ప‌లు ప్ర‌శ్న‌లు సంధిస్తూ.. విచార‌ణ కోరుతున్నారు. దీనిని అధికార వ‌ర్గాలు కూడా సీరియ‌స్‌గా తీసుకున్నాయి.

ఇవీ.. దీప్కేకు ప్ర‌శ్న‌లు..

1) అంత సొమ్ము ఎక్క‌డిది?: అభిజిత్ దీప్కే అమెరికాలో క‌మ్యూనికేష‌న్ ఇంజ‌నీరింగ్ చ‌దివారు. అయితే.. ఆయ‌న‌కు అమెరికాకు వెళ్లేంత సొమ్ము ఎక్క‌డి నుంచి వ‌చ్చింది? దానిని ఎవ‌రు ఇచ్చారు.. అన్న‌ది స‌ద‌రు బీజేపీ సానుభూతి ప‌రుడు.. అమిత్ తివారీ ప్ర‌శ్నించారు. దీనిపై విచార‌ణ చేయాల‌ని.. అప్పుడు నిజానిజాలు తెలుస్తాయ‌ని పేర్కొన్నారు. దీనిని విచార‌ణ‌కు తీసుకున్నారు.

2) కుటుంబ ఆదాయం లెక్క‌లు ఏవీ?: అభిజిత్ దీప్కే తండ్రి భ‌గ‌వాన్ దీప్కే.. కేవ‌లం చిన్న ప్ర‌భుత్వ ఉద్యోగి మాత్ర‌మేన‌ని.. ఆయ‌న రిటైరై కూడా చాలా కాల‌మే అయింద‌ని అమిత్ తివారీ త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. కానీ, ఇటీవ‌ల ఈ కుటుంబం విల్లాను కొనుగోలు చేసింద‌ని.. పొలాలు కూడా కొనుగోలు చేసింద‌ని ఈ సొమ్మును కుటుంబ ఆదాయం లెక్క‌ల్లో చూపించారో లేదో ప‌రిశీలించాల‌ని ఐటీ విభాగానికి లేఖ స‌మ‌ర్పించారు. దీనిని కూడా అధికారులు విచార‌ణ‌కు తీసుకున్నారు.

3) విరాళాలు సేక‌రించ‌వ‌చ్చా? విద్యార్థుల‌కు న్యాయ స‌హాయం అందిస్తామ‌ని పేర్కొంటూ.. దీప్కే నేతృత్వంలోని కాక్రోచ్ జ‌న‌తా పార్టీ.. విరాళాలు సేక‌రించేందుకు ముందుకు వ‌చ్చింది. దీనికి అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. చాలా మంది త‌ట‌స్తులు విరాళాలు ఇచ్చారు. ఇలా.. విరాళాలు తీసుకోవ‌చ్చా? ఇది చ‌ట్ట‌బ‌ద్ధ‌మేనా? కాక‌పోతే.. దీప్కేపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ తివారీ మ‌రో పిటిష‌న్ వేశారు. ఇవ‌న్నీ.. అధికారులు విచార‌ణ‌కు తీసుకున్నారు.  

ముందే తెలుసు: దీప్కే

ఇలాంటివి వ‌స్తాయ‌ని త‌మ‌కు ముందే తెలుసున‌ని దీప్కే తండ్రి భ‌గ‌వాన్‌ వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికే చాలా ఆల‌స్య‌మైంద‌న్నారు. తాము ప్ర‌తి రూపాయినీ నిజాయితీగానే సంపాయించామ‌న్నారు. త‌మ కుమారుడు ఒక‌వైపు ప్రైవేటు ఉద్యోగం చూస్తూ.. అమెరికాలో చ‌దువుకున్నార‌ని తెలిపారు. ఎలాంటి విచార‌ణ‌కైనా తాము సిద్ధ‌మేన‌ని అన్నారు. ప్ర‌జా జీవితంలోకి అడుగు పెట్ట‌డంతోనే ఇవ‌న్నీ వ‌స్తున్నాయ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అయినా వెన‌క్కి త‌గ్గ‌బోమని ఆయ‌న చెప్పారు. 

This post was last modified on August 2, 2026 10:23 pm

Share

Recent Posts

పిఠాపురంలో ఎవ్వ‌రికి ఛాన్స్ లేద‌బ్బా.. !

సామాజికంగా.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ప‌రంగా.. నాయ‌కులు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో పాగా వేసేందుకు ప్ర‌య‌త్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్కొక్క‌…

1 hour ago

కూట‌మి కాన్ఫిడెన్స్ ఏంటి?

వ‌చ్చే ఎన్నికల్లోనూ కూట‌మి విజ‌యం సాధిస్తుంద‌న్న బ‌ల‌మైన సంకేతాలు వ‌స్తున్నాయి. నాయ‌కులు చెప్ప‌డ‌మే కాదు.. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న కొన్ని ఆన్‌లైన్…

2 hours ago

రవితేజ పోటీని యష్ తట్టుకోవాలంటే

ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…

2 hours ago

టార్గెట్ చేరుకున్న టాక్సిక్ తెలుగు వేడుక

నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…

3 hours ago

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

4 hours ago

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

5 hours ago