ట్రంప్ బ్యాన్‌పై ట్విట్టర్ కీలక ప్రకటన

అమెరికా చరిత్రలోనే వరస్ట్ ప్రెసిడెంట్లలో ఒకడిగా పేరు తెచ్చుకుని వెళ్లిపోయాడు డొనాల్డ్ ట్రంప్. ఆయన అధికారం చేపట్టిన తొలి నాళ్లలో వ్యవహరించిన తీరుతోనే తాము సరైన వ్యక్తికే పట్టం కట్టామా ట్రంప్‌కు ఓటేసిన వాళ్లు పునరాలోచనలో పడేలా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వివాదాస్పదంగా వ్యవహరించారు. ఆ తర్వాత నాలుగేళ్లలో జరిగిన పరిణామాలు అందరూ చూశారు.

కొవిడ్ టైంలో ట్రంప్ పనితీరు మరింత దిగజారింది. అధికార మార్పు తప్పదని అప్పుడే అందరికీ అర్థమైపోయింది, చివరికి అంచనాలకు తగ్గట్లే ఫలితాలు వచ్చాయి. ట్రంప్ ఓడిపోయాడు. కానీ ఆ సంగతి ఆయన ఒప్పుకోలేదు. ఫలితాలు స్పష్టంగా అందరికీ తెలుస్తున్నా తనదే విజయం అని, మళ్లీ అధ్యక్షుణ్ని కాబోతున్నానని వితండవాదం చేశాడు.చివరికి వైట్ హౌస్‌ను ఖాళీ చేయడానికి కూడా నిరాకరించడం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఎన్నికల సమయంలో ట్రంప్ తీరుతో విసిగిపోయిన ట్విట్టర్ యాజమాన్యం ఆయన అకౌంట్‌ను నిషేధించిన సంగతి తెలిసిందే. తనదే విజయం అంటూ ప్రకటనలు చేయడం, తీవ్ర వివాదాస్పద ట్వీట్లు వేయడంతో విసిగిపోయిన ట్విట్టర్ యాజమాన్యం ఆయన ఖాతాను మూసేస్తున్నట్లు ప్రకటించింది. ఆ స్థాయి వ్యక్తికి వ్యతిరేకంగా ఇంత పెద్ద నిర్ణయం తీసుకుున్నారంటే అంత చిన్న విషయం కాదు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ట్విట్టర్ తన నిర్ణయానికి కట్టుబడే ఉందీ విషయంలో.

కాగా ఇప్పుడు ట్విట్టర్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ నిషేధంపై మరో కీలక ప్రకటన చేసింది. ఈ నిర్ణయం శాశ్వతమని, ట్రంప్ అకౌంట్‌పై బ్యాన్‌ను తొలగించే అవకాశమే లేదని స్పష్టం చేసింది. 2024లో మళ్లీ ఎన్నికల్లో గెలిచి ట్రంప్ రెండో సారి అధ్యక్షుడు అయినా సరే.. ఆయన ట్విట్టర్ ఖాతాపై నిషేధం తొలగిపోదని ఖరాఖండిగా చెప్పేయడం గమనార్హం. దీన్ని బట్టి ట్రంప్ ఎంత వివాదాస్పదుడన్నది అర్థం చేసుకోవచ్చు.