తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తాను చెప్పే మాటలకు ఏ మాత్రం సాక్ష్యాలు.. ఆధారాలు చూపించనప్పటికి.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల్ని ఆధారాలుగా చూపిస్తున్నారు. ఇంతకూ రేవంత్ తాజా ఆరోపణ ఏమంటే.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇన్ చార్జిగా కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డిని నియమించటం వెనుక అసలు విషయం వేరే ఉందన్న రేవంత్.. కొత్త సంచలనానికి తెర తీశారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ నుంచి నిధులు సమకూరుతున్నాయని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మాట్లాడిన రేవంత్.. తమిళనాడు ఎన్నికల్లో టీఆర్ఎస్ సహకారం పూర్తిస్థాయిలో ఉండేందుకు కిషన్ రెడ్డిని నియమించారు. ఇటీవల సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన సందర్భంగా తమిళనాడు ఎన్నికల్లో బీజేపీకి పూర్తిగా సహకరిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు.
అందుకే.. తెలంగాణ ఇంటెలిజెన్స్ ను తమిళనాడుకు పంపి బీజేపీకి కేసీఆర్ సహకారాన్ని అందిస్తున్నారంటూ విమర్శించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates