ఏపీ మాజీ సీఎం జగన్ పై ఆ పార్టీ మాజీ నేత, పీఆర్పీ అధ్యక్షుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచింది జగన్ అని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. వైఎస్సార్ మరణించిన వెంటనే సీఎం కావాలని జగన్ పట్టుబట్టారని, అందుకు సోనియా గాంధీ ఒప్పుకోకపోవడంతోనే తన ఎంపీ పదవికి రాజీనామా చేసి సొంతపార్టీ పెట్టేందుకు వెళ్లారని అన్నారు.
వైసీపీ పెట్టినప్పటి నుంచి తాను జగన్ వెంట ఉన్నానని, జగన్ తో పాటు జైలుకు వెళ్లానని, అందుకే పార్టీలో తాను నంబర్ 2గా ఉన్నానని చెప్పారు. తన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇచ్చారని, ఊరికే తనకు ఆ హోదా దక్కలేదని అన్నారు.
ఇంత చేసిన తనను సజ్జలకు రిపోర్ట్ చేయమని చెప్పారని, అన్ని రకాలుగా అవమానించిన తర్వాతే పార్టీకి గుడ్ బై చెప్పానని తెలిపారు. ఇదంతా జగన్ కు తెలుసని, అయితే, చాలా విషయాలు ఆయనకు తెలియకుండా ఆయన చుట్టూ ఒక కోటరీ ఏర్పడిందని పరోక్షంగా సజ్జలను టార్గెట్ చేశారు.
జగన్, షర్మిలల మధ్య ఆస్తి వివాదం గురించి తాను మాట్లాడనని, వారే కూర్చొని పరిష్కరించుకోవాలని అన్నారు. వారి వ్యక్తిగత విషయాల గురించి ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడడం సమంజసం, అది నైతికత కాదని అన్నారు. ప్రతి కుటుంబంలో సమస్యలుంటాయని, వాటిని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని మాత్రమే చెప్పగలనని తెలిపారు. తనతోపాటు కేవీపీకి జగన్ కుటుంబ వ్యవహారాల గురించి తెలుసని అన్నారు.
40 ఏళ్లుగా టీడీపీ అనుసరిస్తున్న విధానాలను పీఆర్పీ కూడా అనుసరిస్తుందని, బడుగుబలహీన వర్గాల కోసం తాను పార్టీ పెట్టానని చెప్పారు. వచ్చే ఉగాది తర్వాత ఏపీలో పాదయాత్ర చేపడతానని, గ్రామాల్లో ప్రజాసమస్యలు తెలుసుకుంటానని అన్నారు. పార్టీ తనదే అయినా సీఎం అభ్యర్థిని మాత్రం తాను కాదని మరోసారి ఆయన స్పష్టం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates