లాక్ డౌన్ ఆరంభమైన కొత్తలో మోడీ సర్కారు పట్ల చాలా సానుకూలంగా కనిపించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు.. కేంద్రం మీద ఇంతెత్తున లేస్తున్నారు. కరోనా కష్ట కాలంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి సరైన సాయం అందట్లేదని.. మరీ కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆయన అంటున్నారు.
నిన్నటి ప్రెస్ మీట్లో కేంద్రం మీద ఆయన ఎలా విరుచుకుపడ్డారో తెలిసిందే. ఇదిలా ఉంటే కేంద్రం ఈ నెల 17 వరకు లాక్ డౌన్‌ను పొడిగిస్తే.. కేసీఆర్ ఏమో 29 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ ఉంటుందని అన్నారు. ఈ ఆంక్షల విషయంలో కేసీఆర్ మొదట్నుంచి కేంద్రం కంటే ఒక అడుగు ముందు ఉండటం.. కేంద్రం ఎప్పుడు లాక్ డౌన్ ప్రకటన చేయడానికి ముందో, వెనుకో వచ్చి రాష్ట్రంలో మరింత ఎక్కువ కాలం లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రకటన చేస్తుండటం గమనార్హం.
ఈ విషయంలో మోడీ-కేసీఆర్ మధ్య వేలం పాట తరహాలో వ్యవహారం నడుస్తోందంటూ ఓ నెటిజన్ పేలిపోయే మీమ్ ఒకటి తయారు చేశాడు. ఐపీఎల్ వేలం జరిగినపుడు ఒక ఆటగాడికి ఓ ఫ్రాంచైజీ ఒక రేట్ కోట్ చేస్తే దాని మీద హైక్‌తో ఇంకో జట్టు బిడ్ వేయడం చూస్తుంటాం. దాంతో ఈ విషయాన్ని పోలుస్తూ మీమ్ రూపొందించారు.
మోడీ మొదటగా మార్చి 28 వరకు లాక్ డౌన్ అంటే.. కేసీఆర్ 31 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ ఉంటుందని ప్రకటించారు. తర్వాత మోడీ ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్‌ను పొడిగిస్తే.. కేసీఆర్ ఏప్రిల్ 30 అంటూ కొత్త గడువు విధించార. తర్వాత మే 3 వరకు లాక్ డౌన్ అంటూ ప్రకటన చేస్తే.. కేసీఆర్ మే 7 అంటూ కొత్త డేట్ ఇచ్చారు. ఇంతలో మోడీ వచ్చి మే 17 వరకు మళ్లీ లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత మోడీ ఏం చేయబోతున్నాడో ఇంకా తేలలేదు. ఈలోపు కేసీఆర్ వచ్చి తెలంగాణలో లాక్ డౌన్ మే 29 వరకు ఉంటుందని ప్రకటించాడు. దీంతో ఈ వ్యవహారం వేలం పాటలా ఉందంటూ మీమ్ ద్వారా కామెడీ చేశారు.
This post was last modified on May 6, 2020 2:57 pm
యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డకు యూత్‌లో బంపర్ క్రేజ్ తీసుకొచ్చి తనను స్టార్‌ను చేసిన సినిమా.. డీజే టిల్లు. ఈ…
మహేష్ బాబు కెరీర్లో పవర్ ఫుల్ హిట్లలో ‘బిజినెస్‌మేన్’ ఒకటి. ‘పోకిరి’ తర్వాత పూరితో మహేష్ చేసిన ఈ సినిమాకు…
గత వారం రోజులుగా అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం సోషల్ మీడియాను ఎలా ఊపేస్తోందో తెలిసిందే. పచ్చళ్ల రేట్లు ఎక్కువ…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాప్తాడు పర్యటన ముగిసింది. ఉమ్మడి అనంతపురం జిల్లా…
ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ మరో ఓటమిని మూటగట్టుకుంది. వాంఖడే వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి 12 పరుగుల…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సోమవారం అగ్ని ప్రమాదంలో గాయపడ్డ…