అదేం చిత్రమో కానీ… రెండూ తెలుగు రాష్ట్రాల్లో ఒకే విధమైన రాజకీయాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణాలో బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధినేతలు ఆస్తి వివాదాల్లో చిక్కుకొని సొంత చెల్లెళ్లకు అన్యాయం చేశారనే ఆరోపణలు రావడం విమర్శల పాలయ్యింది.
పాపం ఆ ఇద్దరు చెల్లెల్లు ఒకవైపు ఆస్తి కోసం పోరాడుతూనే మరోవైపు రాజకీయ వారసత్వం కోసం తమదైన ప్రయత్నం చేస్తున్నారు. ఇదే విషయం మీద తాజాగా చర్చ జరుగుతుంది. సొంత నియోజకవర్గమైన కొడంగల్ లో మహిళా సంఘాలతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.
ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని తోడబుట్టిన చెల్లెలినే కేటీఆర్ ఇంటి నుంచి గెంటివేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. జైలుకు వెళ్లి వచ్చిన చెల్లెల్ని ఏ అన్నయినా అక్కున చేర్చుకొని ధైర్యం చెబుతాడని, కేటీఆర్ మాత్రం ఇదే మంచి అవకాశం అని కుట్రపూరితంగా బయటకు నెట్టేశాడని ఆరోపించారు. కేసీఆర్ పదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించినప్పటికీ ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. మేము అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తే జీర్ణించుకోలేక ఆటో డ్రైవర్ల చేత గొడవలు చేయించారని ఆరోపించారు.
తెలంగాణాలో ఆస్తిలో వాటా ఇవ్వకుండా సొంత చెల్లిని తరిమేశారంటూ కేటీఆర్ ఆరోపణలు ఎదురుకున్నట్లే.. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధినేత జగన్ కూడా సొంత చెల్లిని ఇబ్బందులు పెడుతున్నారనే ఆరోపణలు, వివాదాల మీద తీవ్రంగా చర్చ జరుగుతుంది. ఆస్తి పంపకాల్లో చెల్లిలికి అన్యాయం చేసిన జగన్ చివరికి ఆమె కూతురి పెళ్ళికి కూడా అడ్డంకులు సృష్టించారని ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది.
బెంగుళూరులోని యలహంక హాలులో షర్మిల కూతురి పెళ్లికి ఏర్పాట్లు చేసుకొని, ఆహ్వాన పత్రికలు ముద్రించి పంపిణీ చేసిన తర్వాత అక్కడ కుదరడంటూ జగన్ హుకుం జారీ చేయడం, అది కాస్త రచ్చవడం జరిగింది. స్థానిక ఎన్నికల్లో దీని ప్రభావం పడిందని, అందుకే కడప జిల్లాలో సైతం ఘోర పరాజయం మూటకట్టుకోవాల్సి వచ్చిందని ప్రచారం జరుగుతుంది.
మొత్తం మీద తెలంగాణలో మహిళా అంశంపై విమర్శలు ఎదుర్కొన్న బీఆర్ఎస్ ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ రెండు పార్టీల రాజకీయ పరిణామాలపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఆసక్తికరంగా ఈ పార్టీలకు చెందిన నేతలు కేటీఆర్, జగన్ మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతుండటం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on November 8, 2026 11:02 pm
సూర్య కొత్త సినిమా 'సీన్' వసూళ్లు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. రివ్యూలు మరీ గొప్పగా రాలేదు. పబ్లిక్ టాక్ సోషల్ మీడియాలో…
పోలవరం జిల్లాలో తాజాగా జరిగిన పరిషత్ ఎన్నికలలో జనసేన పూర్తిగా ఇరుకున పడింది. రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు ప్రజలు జేజేలు…
తెలుగునాట అతి పెద్ద పండగల్లో దీపావళి ఒకటి. సెలవులు ఎక్కువ ఉండకపోయినా సెలబ్రేషన్స్ పీక్స్ లో ఉంటాయి. ముఖ్యంగా టపాసుల…
ఒక మార్పు మనిషినే కాదు.. రాజకీయాలను కూడా మార్చేస్తుంది. అమరావతికి కట్టుబడి ఉంటామని.. అమరావతి రాజధానిని మార్చబోమని.. అసలు అమరావతి…
ఇప్పుడు ఎక్కడ చూసినా రామాయణ పార్ట్ 1 కు వచ్చిన స్పందన, రికార్డు కలెక్షన్ల గురించిన చర్చే జరుగుతోంది. హిందీలోనే…
ప్రభాస్ ది రాజా సాబ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్ మళవిక మోహనన్. తాజాగా ఈ ముద్దుగుమ్మ.. తన…