Categories: Movie News

ఆకాశపు తారకు అంతులేని అవకాశాలు

టాలీవుడ్ లో ఇప్పుడో కొత్త పేరు బాగా హల్చల్ చేస్తోంది. ఆకాశంలో ఒక తార అంత పోటీలో విజయం సాధించడం ఒక ఎత్తు అయితే, దుల్కర్ సల్మాన్ కన్నా ఎక్కువ హైలైట్ సాత్విక వీరవల్లి కావడం హాట్ టాపిక్ గా మారింది. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ తనను ఇంకో రెండు సినిమాలకు బుక్ చేసుకున్నామని, నాగచైతన్య 25 కోసం ఆల్రెడీ ఆడిషన్ కూడా అయిపోయిందని చెప్పడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అంటే సాత్విక ప్రభావం ముందే ఊహించారన్న మాట.

రెండు తమిళ ప్రాజెక్టులకు కూడా సాత్విక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారముంది. రామ్ చరణ్ 17 కోసం లుక్ టెస్ట్ వగైరాలు జరిగాయి కానీ దర్శకుడు సుకుమార్ నుంచి ఇంకా సానుకూల సంకేతం అయితే రాలేదు. తెలుగు స్వచ్ఛంగా రాకపోయినా, ఎన్ఆర్ఐ అమ్మాయే అయినా తెరమీద అసలా ఫీలింగ్ రాకుండా చేయడంలో సాత్విక చాలా కష్టపడింది. సహజమైన నటనతో ఆకట్టుకుంది. కంటెంట్ పరంగా కమర్షియల్ మూవీ కాకపోవడంతో కేవలం పెర్ఫార్మన్స్ మాత్రమే ఫోకస్ అయ్యింది.

అసలే టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత గత కొన్నేళ్లుగా వేధిస్తోంది. రష్మిక మందన్న బిజీ గురించి తెలిసిందే. పైగా మునుపటిలా స్టార్ హీరోల సరసన ప్రాధాన్యం ఉందో లేదో చెక్ చేసుకోకుండా ఓకే చెప్పడం లేదు. వరస ఫ్లాపుల వల్ల పూజా హెగ్డే లాంటి సీనియర్లను మనోళ్లు ఆప్షన్ గా పెట్టుకోవడం లేదు. ఈ సమస్య వల్లే దర్శకధీర రాజమౌళి అంతటి వారు మహేష్ బాబు సరసన ప్రియాంకా చోప్రాని తీసుకున్నారు. ఎందుకంటే యాక్షన్ ఎమోషన్ బ్యాలన్స్ చేసే నటి కొత్త వాళ్లలో లేరు కాబట్టి.

సాత్విక వీరవల్లికి ఇప్పుడు గంపెడు ఆఫర్లు సిద్ధంగా ఉన్నాయి. ఎస్ చెప్పడం ఆలస్యం ఇంకో మూడేళ్లు డైరీ నిండిపోతుంది. ప్రాపర్ గా హిట్లు పడాలే కానీ హ్యాపీగా సెటైలైపోవచ్చు. చాలా కాలంగా తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ అంటూ ఎవరూ లేరు. సంవత్సరానికి ఒకరు మారిపోతూనే ఉన్నారు. ఇలాంటి టైంలో సాత్విక కనక కెరీర్ ని సరిగా ప్లాన్ చేసుకుంటే భవిష్యత్తు చాలా బాగుంటుంది. హైదరాబాద్ లోనే మకాం పెట్టేసే అవసరమైతే వచ్చింది. ఆకాశంలో ఒక తార ప్రమోషన్లు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. 

This post was last modified on November 27, 2026 4:23 pm

Share

Recent Posts

చిరు అంటే పవన్ కు ఎంత ప్రేమో..

మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరూ సోదరులే కానీ.. పవన్…

31 minutes ago

తొమ్మిదేళ్ళ నంది అవార్డులు ఒకేసారి.. చైర్మన్ గా బాలయ్య

ఆంధ్రప్రదేశ్ లో దీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న నంది అవార్డుల ప్రదానానికి రంగం సిద్ధమైంది. 2017 నుంచి అవార్డుల…

50 minutes ago

యోగికి మూడోసారి ఛాన్స్ లేనట్టేనా…?

బుల్డోజర్ యాక్షన్ తో దేశంలో క్రేజ్ తెచ్చుకున్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కు మూడోసారి సీఎం ఛాన్స్…

1 hour ago

కూటమి ఐక్యత అవసరమన్న పంచాయతీ ఎన్నికలు

రాష్ట్రంలో వరసగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. మొదట మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. వెనువెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి.…

1 hour ago

వందేళ్ల చరిత్రకు బ్రేక్.. అమెరికా థాంక్స్ గివింగ్ వేడుకకు ప్రకృతి అడ్డంకి..

అమెరికాలో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తుఫాను ప్రభావంతో న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాల్లో వరదలు…

2 hours ago

రాజీ కుదిర్చే భారం చిరంజీవి మీదే

సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాల విషయంలో చిరంజీవికి ఎదురవుతున్న సందిగ్దత గురించి నెలరోజులకు పైగానే సోషల్ మీడియాలో రకరకాల డిస్కషన్లు…

4 hours ago