Movie News

రామాయణతో కాజల్ కి దక్కిందేమి లేదు..!

ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగిన నటి కాజల్ అగర్వాల్. వరుస అవకాశాలు వస్తున్న సమయంలోనే.. సినిమాలకు కొంతకాలం విరామం ఇచ్చి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ మళ్లీ సినిమాల్లోకి అడుగుపెట్టింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆమె అందానికి, నటనకు.. గతంలో ఉన్న క్రేజ్‌కు తగిన పాత్రలు మాత్రం రావడం లేదనే చెప్పాలి.

రీఎంట్రీ తర్వాత హీరోయిన్‌గా ప్రాధాన్యత ఉన్న పాత్రలో కాజల్ కనిపించిన సినిమా అంటే సత్యభామ ఒక్కటే. అయితే ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక స్టార్ హీరోల సినిమాల్లో కాజల్ కనిపించినప్పటికీ, ఆమె పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకుండానే పోయింది.

ఆచార్య సినిమాలో కాజల్ పాత్రనే తొలగించారు. బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరిలోనూ ఆమెకు పెద్దగా ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కలేదు. ఇక ఇండియన్ సినిమాలో కూడా కేవలం చివరి సన్నివేశాలకే కాజల్ పరిమితమైంది. ఇలా వరుసగా చిన్న పాత్రల్లో కనిపిస్తున్న.. కాజల్‌కు రామాయణం రూపంలో మంచి అవకాశం వచ్చిందని అభిమానులు భావించారు.

రణ్‌బీర్ కపూర్, యష్, సాయి పల్లవి వంటి ప్రముఖ నటులు భాగమైన భారీ చిత్రంలో కాజల్ కూడా నటిస్తోందని తెలియడంతో అభిమానులు సంతోషించారు. ముఖ్యంగా యష్‌కు జోడీగా, మండోదరి పాత్రలో ఆమె కనిపించనుందని వార్తలు రావడంతో ఈసారి కాజల్‌కు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కుతుందని ఆశించారు.

కానీ సినిమా విడుదలైన దగ్గర నుంచి.. అభిమానుల్లో నిరాశ కనిపిస్తోంది. ఈ సినిమాలో కనీసం పది నిమిషాలు కూడా కాజల్ కనిపించదు. అసలు ఈ సినిమాలో చాలా తక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్ర ఏదైనా ఉంది అంటే అది కాజల్ పాత్రనే చెప్పవచ్చు. అందుకే ఈ సినిమా చూసిన కాజల్ అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు.

ఈ నేపథ్యంలో కాజల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రామాయణం సినిమా షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోలలో కాజల్..మండోదరి గెటప్ లో, భారీ ఆభరణాలతో ఎంతో అందంగా కనిపిస్తోంది. రాజసం ఉట్టిపడే ఈ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఈ ఫోటోలతో పాటు కాజల్ ఒక పెద్ద క్యాప్షన్ కూడా రాసింది. రామాయణం వంటి గొప్ప చిత్రంలో భాగం కావడం తనకు ఎంతో గర్వకారణమని తెలిపింది. తన పాత్ర చిన్నదైనా, భారతీయ సంస్కృతి, చరిత్ర, విశ్వాసాలతో ముడిపడిన కథలో భాగం కావడం గొప్ప విషయమని వివరించింది.

“నన్ను గుర్తించి, ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగం కావడానికి అవకాశం ఇచ్చిన నితేశ్ తివారీ గారికి ప్రత్యేక థాంక్స్. మన చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే గొప్ప కథలో భాగమయ్యే అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ చిత్రంలో పనిచేసిన అద్భుతమైన కళాకారులందరికీ నా అభినందనలు. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్, రవి దూబే, సన్నీ డియోల్, లారా దత్తా, శోభన వంటి గొప్ప నటులతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. అలాగే రకుల్ ప్రీత్, వివేక్ ఒబెరాయ్, ఆదినాథ్ కొఠారేతో కలిసి సమయం గడపడం, ఎన్నో విషయాలు మాట్లాడుకోవడం, నవ్వుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చింది. కొన్ని సినిమాలను ఒక పాత్ర నిడివితోనో, తెరపై కనిపించే నిమిషాలతోనో కొలవలేం. ఆ కథ గొప్పతనం, దాని వెనుక ఉన్న కష్టం, మనందరి విశ్వాసాలతో ముడిపడిన ఒక గొప్ప చిత్రంలో భాగం కావడం వంటి విషయాలే వాటి ప్రత్యేకతను నిర్ణయిస్తాయి,” అని రాసుకొచ్చింది.

ఇక ఈ క్యాప్షన్ చదివిన కాజల్ అభిమానులు.. తమ బాధని గుర్తించి.. కాజల్ ఈ క్యాప్షన్ పెట్టి ఉంటుందేమో అని అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ఫోటోల కింద కూడా.. త్వరలోనే మిమ్మల్ని మంచి పాత్రలో చూడాలి అనుకుంటున్నాం అని తమ ఆశ వ్యక్తం చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్.

This post was last modified on November 8, 2026 11:39 pm

Page: 1 2 3

Share

Recent Posts

ఆస్తి కోసం చెల్లిని పండగపూట గెంటేసిన కేటీఆర్

అదేం చిత్రమో కానీ... రెండూ తెలుగు రాష్ట్రాల్లో ఒకే విధమైన రాజకీయాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణాలో బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ లో…

49 minutes ago

టాలీవుడ్ హీరోలు ‘సీన్’ చేసి ఉంటే

సూర్య కొత్త సినిమా 'సీన్' వసూళ్లు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. రివ్యూలు మరీ గొప్పగా రాలేదు. పబ్లిక్ టాక్ సోషల్ మీడియాలో…

3 hours ago

పోల‌వ‌రంలో సేన మారాల్సిందే.. !

పోల‌వ‌రం జిల్లాలో తాజాగా జ‌రిగిన పరిషత్ ఎన్నికలలో జ‌న‌సేన పూర్తిగా ఇరుకున ప‌డింది. రాష్ట్ర వ్యాప్తంగా జ‌న‌సేన‌కు ప్ర‌జ‌లు జేజేలు…

4 hours ago

సౌండ్ లేని టపాసులిచ్చిన తెలుగు స్టార్లు

తెలుగునాట అతి పెద్ద పండగల్లో దీపావళి ఒకటి. సెలవులు ఎక్కువ ఉండకపోయినా సెలబ్రేషన్స్ పీక్స్ లో ఉంటాయి. ముఖ్యంగా టపాసుల…

4 hours ago

ఇప్ప‌టికైనా మార్పు వ‌స్తుందా జ‌గ‌న్‌ గారూ!

ఒక మార్పు మ‌నిషినే కాదు.. రాజ‌కీయాల‌ను కూడా మార్చేస్తుంది. అమ‌రావ‌తికి క‌ట్టుబ‌డి ఉంటామ‌ని.. అమ‌రావ‌తి రాజ‌ధానిని మార్చ‌బోమ‌ని.. అస‌లు అమ‌రావ‌తి…

5 hours ago

రాజమౌళి రాముడి మీద డౌట్ అక్కర్లేదు

ఇప్పుడు ఎక్కడ చూసినా రామాయణ పార్ట్ 1 కు వచ్చిన స్పందన, రికార్డు కలెక్షన్ల గురించిన చర్చే జరుగుతోంది. హిందీలోనే…

6 hours ago