Movie News

ప్రభాస్ ఇలా ఆలోచించడమే కావాలి

రెబెల్ స్టార్ ప్రభాస్ రెండు సినిమాలు వచ్చే ఏడాది విడుదలకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఫౌజీ ఏప్రిల్, స్పిరిట్ అక్టోబర్ అంటూ అధికారికంగా డేట్లు కూడా ఇచ్చేశాయి. ఖచ్చితంగా మాట మీద ఉంటాయా లేదానేది పక్కనపెడితే, ఇప్పటికే వాయిదాలు జరిగిపోయాయి కాబట్టి ఈసారి రిలీజ్ డేట్లు మిస్ కాకుండా ఉండేందుకు దర్శక నిర్మాతలు పగలు రాత్రి కష్టపడుతున్నారు. ప్రస్తుతానికి ఈ షెడ్యూల్ లో ఎలాంటి మార్పు లేదు. ఇదిలా ఉండగా ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి ఇంటరెస్టింగ్ బైట్స్ వినిపిస్తున్నాయి.

వాటిలో మొదటిది సీన్ దర్శకుడు జీతూ మాధవన్ తో ప్రభాస్ ఒక ప్యాన్ ఇండియా మూవీ చేయడం. ఇది నిజమైతే డార్లింగ్ ఫ్యాన్స్ కి పెద్ద గుడ్ న్యూస్ అవుతుంది. ఎందుకంటే ప్రభాస్ ఇలా ఆలోచించాలనేది వాళ్ళ కోరిక. రాజా సాబ్ విషయంలో చేసిన తప్పు ఎంత మూల్యాన్ని చెల్లించేలా చేసిందో అభిమానులకు బాగా తెలుసు. రాధే శ్యామ్, ఆది పురుష్ ఎంపికలో జరిగిన పొరపాట్లు మళ్ళీ రిపీట్ కాకూడదంటే ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్న డైరెక్టర్లతో చేతులు కలపాలి. జీతూ మాధవన్ అదే బ్యాచే.

ఇంకా అఫీషియల్ కాలేదు కాబట్టి కన్ఫర్మ్ అని చెప్పలేం కానీ చర్చలైతే సానుకూలంగా జరుగుతున్నాయని వినికిడి. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టుని టేకప్ చేయబోతున్నట్టు సమాచారం. ఫహద్ ఫాసిల్ ఆవేశంతో అందరి దృష్టిలో పడ్డ జీతూ మాధవన్ చాలా తక్కువ టైంలో సూర్య లాంటి స్టార్ హీరోతో సీన్ తీసి మూడు వందల కోట్ల గ్రాసర్ ఇవ్వడం మాములు విషయం కాదు. ఓవర్సీస్ లో ఏకంగా విశ్వనాథ్ అండ్ సన్స్ ని దాటేంతగా వసూళ్లను రాబట్టింది. విలన్ గా నస్లేన్ పేరు మారుమ్రోగింది.

అయితే ఈ కాంబోకి టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఫౌజీ, స్పిరిట్ రిలీజ్ అయ్యాక కల్కి పార్ట్ 2 కోసం ప్రభాస్ ఎక్కువ డేట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత జీతూ మాధవన్ ది సెట్స్ పైకి తీసుకెళ్లొచ్చు. సలార్ 2 శౌర్యంగపర్వం ఉంటుందో లేదో ఇంకా క్లారిటీ లేదు. డ్రాగన్ అయ్యేదాకా ప్రశాంత్ నీల్ బయటికి రారు కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. జీతో మాధవన్ కి ఎస్ చెప్పిన పక్షంలో ఈ సినిమాని 2028 లేదా ఆపై ఏడాది ఎక్స్ పెక్ట్ చేయాలి. ప్రకటన కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.  

This post was last modified on November 27, 2026 5:13 pm

Share

Recent Posts

సంక్రాంతి 2027… క్లారిటీ వచ్చేసినట్టే

2027 సంక్రాంతి బాక్సాఫీస్ పోటీకి సంబంధించి మెల్లగా మబ్బులు వీడుతున్నాయి. ప్రమోషన్ల పరంగా ఒకరు ముందు, ఒకరు వెనుకా ఉన్నప్పటికీ…

27 minutes ago

సుకుమార్ ఇలా చేయడం మొదటిసారేమో

రామ్ చరణ్ 17 కోసం అడుగులు మొదలయ్యాయి. పూజా కార్యక్రమాలు ఆల్రెడీ చేసినప్పటికీ ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వలేదు. డిసెంబర్…

50 minutes ago

ఎట్టకేలకు రుషికొండ ప్యాలెస్ చిక్కుముడి తొలగింది

విశాఖలో గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన రుషికొండ ప్యాలెస్ ఎట్టకేలకు వినియోగంలోకి రానుంది. జగన్ నిర్మించిన ఈ ప్యాలెస్ ను…

52 minutes ago

సందీప్ వంగా ఫ్యానిజం మళ్ళీ బయటపడింది

దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అర్జున్ రెడ్డితో మొదలుపెట్టి యానిమల్ దాకా తీసింది అతి…

3 hours ago

ఆకాశపు తారకు అంతులేని అవకాశాలు

టాలీవుడ్ లో ఇప్పుడో కొత్త పేరు బాగా హల్చల్ చేస్తోంది. ఆకాశంలో ఒక తార అంత పోటీలో విజయం సాధించడం…

4 hours ago

చిరు అంటే పవన్ కు ఎంత ప్రేమో..

మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరూ సోదరులే కానీ.. పవన్…

5 hours ago