రాష్ట్రంలో వరసగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. మొదట మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. వెనువెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే మున్సిపల్, పరిషత్ ఎన్నకల కంటే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మెరుగైన ఫలితాలు సాధించడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు కూటమికి ఒక సందేశం ఇచ్చినట్టయ్యింది.
తొలుత మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలకు గాను 17 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 70 స్థానాలకు ఎన్నికలు జరగ్గా టీడీపీ 61, జనసేన 17, బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించాయి.
వైసీపీ నందికొట్కూరు, బేతంచర్ల, నాయుడుపేటల్లో గెలిచింది. 13 మున్సిపల్ కార్పొరేషన్లలో 12 చోట్ల కూటమి అభ్యర్థులు, ఒక చోట వైసీపీ మేయర్ అభ్యర్థి విజయం సాధించారు. అనంతపురం నగరపాలక సంస్థ ఒక్కటే వైసీపీ గెలిచింది. 582 జడ్పీటీసీలలో టీడీపీ 406, జనసేన 73, బీజేపీ 20 స్థానాల్లో విజయం సాధించాయి. 76 స్థానాల్లో వైసీపీ గెలిచింది.
7,768 ఎంపీటీసీ స్థానాలకు గాను టీడీపీ 5861,జనసేన 4,806, బీజేపీ 117 స్థానాలు గెలుపొందాయి. వైసీపీ 1711 స్థానాల్లో విజయం సాధించింది.
ఇక పంచాయతీ ఎన్నికలకు తొలి విడత జరిగిన ఎన్నికల్లో మొత్తం 3,949 పంచాయతీలకు గాను 760 ఏకగ్రీవం కాగా, 3,189 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవాలతో కలిపి కూటమి మొత్తం 2,539 స్థానాల్లో గెలుపొందింది. వైసీపీ మొత్తం 1,110 స్థానాల్లో విజయం సాధించింది.
అయితే పంచాయతీ ఎన్నికల పట్ల జనసేన పెద్దగా ఇంట్రస్ట్ చూపించినట్లు లేదు. ఏకగ్రీవంగా ఎన్నికైన 28 స్థానాలతో కలుపుకొని కేవలం 189 స్థానాలతో సరిపుచ్చుకుంది. టీడీపీ, వైసీపీ తర్వాత మూడో స్థానంలో 294 స్థానాలతో ఇండిపెండెంట్లు నిలవగా నాలుగో స్థానంలో జనసేన వుంది. వాస్తవానికి ఈ ఎన్నికలు పార్టీ గుర్తుమీదా జరగకపోయినా అధిక శాతం స్థానాల్లో ఈ పార్టీలు బలపరిచిన అభ్యర్థులే ఉంటారు కాబట్టి వారి బలాలు కూడా తెలుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
పంచాయతీ ఎన్నికల్లో జనసేన వెనకబడి పోవడానికి ప్రధాన కారణం కూటమితో కలిసి పోటీ చేయకుండా అత్యధిక స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయడమేనని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే కూటమిగా వున్న మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన జనసేన సొంతంగా పోటీ చేసిన పంచాయతీ ఎన్నికల్లో నాలుగో స్థానంలో నిలవడం ఆలోచించదగిన విషయమని చెబుతున్నారు. మంత్రిగా పవన్ కళ్యాణ్ కు మంచి మార్కులు పడినప్పటికి క్షేత్ర స్థాయిలో జనసేన ఇంకా బలోపేతం కాలేదు. పార్టీ నిర్మాణం కూడా జరగలేదు.
ఈ ఎన్నికలు కూటమి బలబలాలను స్కాన్ చేసి చేతికి ఇచ్చింది. కూటమిగా ఉంటేనే బలంగా వుంటారు, లేకపోతే వైసీపీ లబ్దిపొందడం ఖాయమని లెక్క తేల్చింది. విడిపోతే ఎవరి బలం వారికి ఉంటుంది కానీ చీలిక ఓట్లతో వైసీపీ గట్టున పడుతుంది. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ద్వితీయ స్థానంలో నిలవడం దీనికి నిదర్శనం. కొన్ని అంతర్గత ఇబ్బందులున్నా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా కలిసి పోటీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది విశ్లేషకుల మాట. ఏమి జరుగుతుందో వేచి చూద్దాం…
This post was last modified on November 27, 2026 2:57 pm
టాలీవుడ్ లో ఇప్పుడో కొత్త పేరు బాగా హల్చల్ చేస్తోంది. ఆకాశంలో ఒక తార అంత పోటీలో విజయం సాధించడం…
మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరూ సోదరులే కానీ.. పవన్…
ఆంధ్రప్రదేశ్ లో దీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న నంది అవార్డుల ప్రదానానికి రంగం సిద్ధమైంది. 2017 నుంచి అవార్డుల…
బుల్డోజర్ యాక్షన్ తో దేశంలో క్రేజ్ తెచ్చుకున్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కు మూడోసారి సీఎం ఛాన్స్…
అమెరికాలో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తుఫాను ప్రభావంతో న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాల్లో వరదలు…
సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాల విషయంలో చిరంజీవికి ఎదురవుతున్న సందిగ్దత గురించి నెలరోజులకు పైగానే సోషల్ మీడియాలో రకరకాల డిస్కషన్లు…