స్థానిక ఎన్నికల ఫలితాలతో ఉత్సాహంగా వున్న కూటమి పార్టీల మధ్య జడ్పీ చైర్మన్ స్థానాల విషయం ఫైనల్ అయినట్లు సమాచారం. పొత్తులో భాగంగా మిత్రపక్ష పార్టీలైన జనసేనకు ఐదు, బీజేపీకి ఒక జడ్పీ చైర్మన్ పదవులు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. శనివారం పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం 28 జడ్పీ చైర్మన్ పదవులు వున్నాయి. అన్నీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయకేతనం ఎగరేయడం ఖాయమని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అయితే మిత్రులకు కేటాయించిన స్థానాల్లో అనివార్యమైతే మార్పులు చేర్పులు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
ఒప్పందంలో భాగంగా పల్నాడు, శ్రీసత్యసాయి, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులు జనసేనకు దక్కనున్నాయి. దాంతో పాటుగా తిరుపతి జిల్లా వైస్ ఛైర్మన్ పోస్టు జనసేనకు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. ఇక బీజేపీకి కడప స్థానం ఇవ్వనున్నారు. ఈ సీటు కోసం ఎమ్మెల్యే అది నారాయణ రెడ్డి గట్టి పట్టు పట్టారు. బీజేపీకి ఇతరా స్థానం కేటాయించేందుకు టీడీపీ నాయకత్వం ప్రయత్నం చేసినప్పటికి ఆదినారాయణ మాట వినలేదని సమాచారం.
కడప జడ్పీ చైర్మన్ గా తన సోదరుడి కుమారుడిని కూర్చోబెట్టి జగన్ మీద పైచేయి సాధించాలని ఎమ్మెల్యే అది నారాయణ రెడ్డి కసిగా ఉన్నట్టు చెబుతున్నారు. ఇక్కడ టీడీపీ నుంచి చాలా మంది పోటీ పడుతున్నారు. అయినప్పటికీ కూటమి ధర్మంలో భాగంగా టీడీపీ ఒక అడుగు వెనక్కి తగ్గిందని ప్రచారం జరుగుతుంది. కడప జడ్పీ చైర్మన్ గా డాక్టర్ చదిపిరాళ్ల రాజేష్ రెడ్డి బాధ్యతలు చేపట్టడం ఖాయమని బీజేపీ నాయకులు చెబుతున్నారు. మున్ముందు కడపలో వైఎస్ కుటుంబానికి, ఆదినారాయణ కుటుంబానికి మధ్య పోరు తీవ్రతరం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు.
This post was last modified on November 7, 2026 11:22 am
కెజిఎఫ్ లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత హీరో యష్ ఒప్పుకున్న సినిమాలు రెండు. టాక్సిక్ ఏమయ్యిందో తెలిసిందే. అర్థం…
చిన్న చిన్న క్యారెక్టర్లతో తమిళంలో తన కెరీర్‌ను మొదలుపెట్టిన త్రిష.. ఆ తర్వాత ఎంతో స్టార్ స్టేటస్‌ను అందుకుంది. ముఖ్యంగా…
కమల్ హాసన్ కొత్త సినిమా సండియార్ నిన్న అధికారికంగా ప్రకటించారు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ రివెంజ్ ఇంటెన్స్…
డిసెంబర్ లో ప్రారంభం కాబోతున్న చిరంజీవి టాక్ షో మెగావర్స్ షూటింగ్ ఆర్టిస్టుల డేట్లను బట్టి నిర్విరామంగా జరిగిపోతోంది. బ్రహ్మానందం…
బాలీవుడ్ బాక్సాఫీస్ కు మళ్ళీ ఊపిరొచ్చింది. వందల కోట్ల వసూళ్లు తెచ్చే బ్లాక్ బస్టర్ కోసం కళ్ళు కాయలు కాచేలా…
అమ్మ బాబోయ్ అంటూ అదిరిపడుతున్నారు జనం. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ కుమారుడు, సోదరుడు అనిల్ రెడ్డి…