డిసెంబర్ లో ప్రారంభం కాబోతున్న చిరంజీవి టాక్ షో మెగావర్స్ షూటింగ్ ఆర్టిస్టుల డేట్లను బట్టి నిర్విరామంగా జరిగిపోతోంది. బ్రహ్మానందం – సునీల్ – సత్యలతో ఒక భాగం పూర్తి చేయగా తాజాగా నాగార్జున, నాగచైతన్య, అఖిల్ తో ఇంకో ఎపిసోడ్ నిన్న షూట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతున్న మెగావర్స్ చిత్రీకరణ ప్రత్యేకంగా ఆహ్వానించిన అభిమానుల మధ్య జరుగుతోంది. స్క్రిప్ట్ పనులు బివిఎస్ రవి చూస్తుండగా నిర్మాణ వ్యవహారాలు గోల్డ్ బాక్స్ బ్యానర్ మీద సుస్మిత కొణిదెల చూసుకుంటున్నారు.
అంతర్గత సమాచారం ప్రకారం ఈ ఎపిసోడ్ చిరంజీవి, నాగార్జున మధ్య ఎంత బలమైన స్నేహం ఉందో చాలా పెద్ద స్థాయిలో చూపించబోతోందట. ముఖ్యంగా ఇద్దరి జీవితాల్లో పిల్లల విషయంలో ఎదురుకున్న చేదు సంఘటనలు వారి మధ్య చర్చకు వచ్చాయని చెబుతున్నారు. ఈ సందర్భంగా నాగార్జున చాలా ఎమోషనల్ గా కొన్ని మీడియా ఛానల్స్ , వ్యూస్ కోసం పాకులాడే కొందరు దొంగ జ్యోతిష్కుల మీద ఓ రేంజ్ లో ఫైర్ అవ్వడం హైలైట్ గా ఉంటుందని అంటున్నారు.
అఖిల్ వేసిన జోకులు, చైతు పంచుకున్న జ్ఞాపకాలు, గీతాంజలి టైంలో జరిగిన సంఘటనలు, వీళ్ళ గురించి అమలతో పాటు ఇద్దరు కోడళ్ళు ఏమనుకుంటున్నారనే వీడియోలు ఇలా మొత్తం ఒక కంప్లీట్ ప్యాకేజీగా రూపొందించినట్టు తెలిసింది. మెగావర్స్ ఫస్ట్ ఎపిసోడ్ గా మొదట దీన్నే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు కానీ డిసెంబర్ మొదటి లేదా రెండో వారంలో గ్రాండ్ లాంచ్ ఉంటుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రోమోని రెడీ చేసే పనిలో ఇంకో టీమ్ బిజీగా ఉంది.
గతంలో బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో తరహాలో ఇది చిరు మార్కు ఎంటర్ టైన్మెంట్ తో విభిన్నంగా ఉంటుందని యూనిట్ టాక్. చిరు నాగ్ ఇవ్వబోయే సర్ప్రైజులు సోషల్ మీడియాలో వైరల్ కావడం ఖాయమని చూసినవాళ్ల రిపోర్ట్. అవన్నీ ముందే చెప్పేయడం భావ్యం కాదు కానీ మొత్తానికి చిరు ఒక గ్రాండ్ టాక్ షోతో ప్రేక్షకులకు తనను తాను కొత్తగా ఆవిష్కరించబోతున్నారు. జనవరి 13 విడుదల కానున్న కాకా షూటింగ్ లో బిజీగా ఉంటూనే చిరు ఈ మెగావర్స్ కి పూర్తి సహకారం అందిస్తూ పరుగులు పెట్టిస్తున్నారు.
This post was last modified on November 7, 2026 11:18 am
కెజిఎఫ్ లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత హీరో యష్ ఒప్పుకున్న సినిమాలు రెండు. టాక్సిక్ ఏమయ్యిందో తెలిసిందే. అర్థం…
చిన్న చిన్న క్యారెక్టర్లతో తమిళంలో తన కెరీర్‌ను మొదలుపెట్టిన త్రిష.. ఆ తర్వాత ఎంతో స్టార్ స్టేటస్‌ను అందుకుంది. ముఖ్యంగా…
కమల్ హాసన్ కొత్త సినిమా సండియార్ నిన్న అధికారికంగా ప్రకటించారు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ రివెంజ్ ఇంటెన్స్…
స్థానిక ఎన్నికల ఫలితాలతో ఉత్సాహంగా వున్న కూటమి పార్టీల మధ్య జడ్పీ చైర్మన్ స్థానాల విషయం ఫైనల్ అయినట్లు సమాచారం.…
బాలీవుడ్ బాక్సాఫీస్ కు మళ్ళీ ఊపిరొచ్చింది. వందల కోట్ల వసూళ్లు తెచ్చే బ్లాక్ బస్టర్ కోసం కళ్ళు కాయలు కాచేలా…
అమ్మ బాబోయ్ అంటూ అదిరిపడుతున్నారు జనం. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ కుమారుడు, సోదరుడు అనిల్ రెడ్డి…