Political News

ఓహో… ఇలా కూడా ప్రచారం చేయొచ్చా?

రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇంటింటి ప్రచారాలు, కరపత్రాల పంపిణీ, మైక్ ప్రచారం ఇప్పుడు పాత పడిపోయాయి. డ్రోన్లతో ప్రచారం చేస్తూ నింగిలోకి ఎన్నికల గుర్తును ఎగరేసి ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పేరుకు గ్రామీణ ఎన్నికలైనప్పటికీ పట్టణ స్థాయిలో ప్రచారం జరుగుతుంది. పల్లె ప్రతినిధులు స్మార్ట్ ప్రచారాలతో ఊదర గొడుతున్నారు. 

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంతో పాటుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన వివిధ పార్టీల అభ్యర్థులు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. డ్రోన్ల ద్వారా తమ ఎన్నికల గుర్తులను ఆకాశంలో ఎగురవేస్తూ వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

వీరవాసరంలో ఒక అభ్యర్థి డ్రోన్ కు ‘మంచం ‘గుర్తును వేలాడదీసి ఊరంతా కనిపించేలా ప్రదర్శించడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదే జిల్లాలోని మండపాక గ్రామంలో కూడా ఒక అభ్యర్థి డ్రోన్‌కు ‘బుట్ట’ గుర్తు, బ్యానర్ కట్టి ఆకాశంలో తిప్పుతూ వినూత్న ప్రచారం చేయడం ఆకట్టుకుంటోంది. 

అలాగే విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో సర్పంచ్ అభ్యర్థి ఒకరు డ్రోన్‌కు ‘మంచం’ గుర్తును కట్టి ఆకాశంలో ఎగురవేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు కార్యకర్తలతో కలిసి వీధులు వెంట తిరుగుతూ ఇంటింటి ప్రచారం చేస్తుంటే వారి వెనకాలే పైన ఆకాశంలో డ్రోన్ కు వేలాడుతూ ఎన్నికల గుర్తు కనిపించడం చేయడం చూసి గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మంచాలు, బుట్టలు ఆకాశంలో ఎగురుతుంటే చిన్నారులు కేరింతలు కొడుతున్నారు.

This post was last modified on November 28, 2026 7:12 pm

Share

Recent Posts

ఎన్ని జిల్లాల్లో వైసీపీ ఉనికిని చాటుకుంది?

స్థానిక ఎన్నికలలో వైసీపీ ప్రభావం అనేక జిల్లాల్లో నామమాత్రంగా కనిపించింది. మున్సిపల్, కార్పొరేషన్, పరిషత్ ఎన్నికల్లో కూటమి ముందు నిలబడేందుకు,…

58 minutes ago

వాహ్… విదేశీ గాయకుల నోట అన్నమయ్య పాట!

విదేశాల్లో ఎక్కడైనా బహిరంగ వేదికల మీద తెలుగు పాట వినిపిస్తే ఆశ్చర్యం ఏమి కలగట్లేదు ఇప్పుడు. గ్లోబలైజేషన్ తర్వాత ప్రపంచం…

2 hours ago

శర్వా గుండెల్లో ‘భోగి’ మంటలు

నిన్న విడుదలైన భోగికి వస్తున్న టాక్ చూసి శర్వానంద్ అభిమానులు తెగ ఫీలైపోతున్నారు. కనీసం యావరేజ్ అన్నా ఏదో అనుకోవచ్చు…

3 hours ago

పోటీ మధ్యలో నలిగిపోయిన నాన్న

నిన్న విడుదలైన సినిమాల్లో కొంచెం ఎక్కువ అటెన్షన్ తీసుకున్నది భోగినే అయినా దాంతో పాటు అయిదారు చిన్న చిత్రాలు బాక్సాఫీస్…

4 hours ago

వృషకర్మ అంచనాలకు మించి ఉండాల్సిందే

వచ్చే వారం విడుదల కాబోతున్న వృషకర్మ మీద నాగచైతన్య అభిమానులు పెట్టుకున్న నమ్మకం అంతా ఇంతా కాదు. తమ్ముడు అఖిల్…

4 hours ago

టోల్ ప్లాజా దగ్గర ఐఏఎస్ రచ్చ

మన దేశంలో టోల్ ప్లాజాల దగ్గర ప్రోటోకాల్ పంచాయతీలకు కొదవే లేదు. కొందరు రాజకీయ నాయకులకు, బ్యూరోక్రాట్లకు..ఇలా నిర్దేశించిన కొంతమంది…

5 hours ago