మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు యూటర్న్ తీసుకున్నారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆయనకు కాంగ్రెస్, వామపక్షాలు కూడా మద్దతు ప్రకటించా యి. అయితే. చిత్రంగా వామపక్షాలు అంతో ఇంతో బలం ఉన్న సెంట్రల్, తూర్పు నియోజకవర్గాల్లోనూ ఏబీవీకి ఓట్లు పడలేదు. నిండా ఆయనకు 12500 ఓట్లు పడ్డాయి. దీంతో ఆయన డిపాజిట్ కూడా కోల్పోయారు. ఈ పరిణామాలతో ఆయన తొలుత తన ఓటమిని అంగీకరిస్తున్నానని పేర్కొన్నారు.
కానీ.. 24 గంటలు గడిచిన తర్వాత.. ఏమైందో ఏమో అన్ని పార్టీలపైనా నిప్పులు చెరుగుతూ.. తాను ఓడిపోలేదని.. తనను పనిగట్టుకుని ఓడించారని అన్నారు. అంతేకాదు.. తాను ఓడిపోయినా.. జిడ్డులాంటి వాడినని పేర్కొన్నారు. రాజకీయాలను వదిలేది లేదని పేర్కొన్నారు. తనకు వచ్చిన ఓట్లు చూసి తాను భయపడడం లేదని.. ఇది ఒక కుట్ర ప్రకారం జరిగిందని.. కాబట్టి తాను ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకొనే ప్రశక్తే లేదని తేల్చి చెప్పారు. కొందరు తాను తప్పుకొంటానని అనుకుంటున్నారని.. అది జరగదని పేర్కొన్నారు.
రాజకీయాలను వదిలి వెళ్లే వ్యక్తిని కాదు. సోషల్ మీడియాలో నాపై విమర్శలు, అవహేళనలు, స్పాన్సర్డ్ వీడియోల ప్రచారం మొదలుపెట్టారు. నన్ను నాకు మద్దతిచ్చేవారికి దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారు. బహుశా నేను సొంతంగా ఆలోచించలేనని వారి అభిప్రాయమేమో! నా పరువు పోయిందట!. కానీ.. నా పరువు పోలేదు. నాకు 12 వేల మంది ఓట్లేశారంటే.. వారంతా నాపై నమ్మకం పెట్టుకున్నవారే కదా! అని ఏబీవీ వ్యాఖ్యానించారు.
విజయవాడ మేయర్ పదవికి పోటీ చేసినప్పుడు తన బాధ్యత విజయవాడ ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడటం, ప్రజా సమస్యలపై ప్రశ్నించడం. బుడమేరు సమస్యపై నిలదీయడం, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని గుర్తుచేయడం. ఇవన్నీ రాజకీయాల కోసం కాదు.. ప్రజల పక్షాన నిలబడటం కోసమేనని ఏబీవీ పేర్కొన్నారు. అవహేళనలతో, స్పాన్సర్డ్ ప్రచారాలతో వెనక్కి తగ్గించగలమని భావించే వారు సమయం వేస్ట్ చేసుకోవద్దు అని వ్యాఖ్యానించారు. గ్రౌండ్లోకి దిగిన తర్వాత.. తాను విమర్శలకు భయపడే వాడిని కాదన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates