మావిగన్.. (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు నగరాలతో కూడిన రాజధాని) జగన్ చేసిన ఈ ప్రకటన వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిందే!. దీనినే తమ అజెండాగా చేసుకుని ఎన్నికలకు వెళ్తామని కూడా ఆయన ప్రకటించారు. కానీ, చిత్రం ఏంటంటే.. తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు అంతర్గతంగా ఈ మావిగన్‌ను ప్రచారం చేశారు. ఈ ప్రభావం భారీగానే ప్రజలపై కనిపించింది. తాజాగా ఇదే విషయంపై పేర్ని నాని వంటి సీనియర్ నాయకులు.. “ఏం చేస్తాం.. అంతా మా ఖర్మ” అని నిట్టూర్చే పరిస్థితి వచ్చింది.
లాభమేంటి?
మావిగన్.. రాజధానిగా ప్రకటిస్తామనిజగన్ ప్రకటించిన తర్వాత.. ఆయా ప్రాంతాల్లోని(విజయవాడ మచిలీపట్నం, గుంటూరు) ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని.. వైసీపీ నాయకులు తెగ ప్రచారం చేసుకున్నారు. తాజా ఎన్నికల్లో ఈ విషయాన్ని జగన్ పక్కన పెట్టినా.. వైసీపీ నేతలు మాత్రం మచిలీపట్నం మునిసిపాలిటీ, విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో జరిగిన ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ, ఎక్కడా ఫలితం కనిపించలేదు. మచిలీపట్నం మునిసిపాలిటీలో టీడీపీ, విజయవాడ కార్పొరేషన్‌లో జనసేన, గుంటూరు కార్పొరేషన్‌లో టీడీపీ విజయ దుందుభి మోగించాయి.
అంటే.. మావిగన్ ప్రాంతంలోని ప్రజలు కూడా జగన్ మాటను నమ్మలేదన్న వాదన బలంగా కనిపించింది. ప్రజలు తమ ఓటు ద్వారానే ఈ విషయాన్ని స్పష్టం చేయడం గమనార్హం. మచిలీపట్నంలో మూడు వార్డులను, విజయవాడలో 5 వార్డులను, గుంటూరులో మూడు వార్డలను మాత్రమే వైసీపీ గెలుచుకుంది. సో.. దీనిని బట్టి రాష్ట్ర రాజధాని విషయంలో జగన్‌కు భిన్నమైన వాదనలోనే ప్రజలు ఉన్నారన్నది సుస్పష్టం అవుతోంది. ప్రజలు అమరావతిని కోరుకుండా.. జగన్ చెప్పినట్టు మావిగన్ కోరుకుని ఉంటే.. ఆయా మూడు కార్పొరేషన్లు లేదా మునిసిపాలిటీల్లో అయినా.. ఏకపక్షంగా వైసీపీని ప్రజలు గెలిపించేవారు. కానీ, అలా జరగలేదు. అంటే.. జగన్.. మావిగన్‌ను ప్రజలు తిరస్కరించారు.
విశాఖలోనూ..
విశాఖను రాజధానిగా ప్రకటిస్తామని జగన్ గత ఎన్నికల సమయానికి ముందు ప్రజలకు వివరించారు. కానీ, అక్కడా ఆయన ప్రకటనను ఎవరూ పట్టించుకోలేదు. ఫలితంగా 2024 ఎన్నికల్లో నాయకులు ఘోరంగా పరాజయం పాలయ్యారు. ఇక, తాజాగాజరిగిన విశాఖ కార్పొరే షన్ ఎన్నికల్లోనూ వైసీపీ ఘోర పరాజయం పాలైంది. చిత్రం ఏంటంటే.. ఇక్కడ ఈనెల 1న జరిగిన ఎన్నికల పోలింగ్ ప్రక్రియపై వైసీపీ మేయర్ అభ్యర్థి, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి సంతృప్తి వ్యక్తం చేశారు. కౌంటింగ్ సమయంలోనూ ప్రశాంతంగానే జరిగిందని పేర్కొన్నారు. సో.. దీనిని బట్టి.. అటు మావిగన్.. మూడు జిల్లాల్లో(ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు), ఇటు విశాఖలోనూ ప్రజలు వైసీపీకి రాం రాం చెప్పేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates