ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనపార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం మునిసిపాలిటిలో ఆదివారం జరిగిన ఎన్నికల పోలింగ్ వివాదానికి దారితీసింది. దీంతో పలు వార్డుల్లో తిరిగి పోలింగ్ నిర్వహించాలని జనసేన నాయకులు, ముఖ్యంగా ఆ పార్టీ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మునిసిపాలిటీలోని 18, 19 సహా పలు వార్డుల్లో జనసేన ఏజెంట్లను అనుమతించలేదని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై మాట్లాడేందుకు ప్రయత్నించినా.. తమను కూడా అక్కడకు రాకుండా అడ్డుకున్నారని తెలిపారు. ఇదేసమయంలో వైసీపీ సహా ఇతర పార్టీ నేతలు మిలాఖత్ అయ్యారని ఆయన ఆరోపించారు.
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, జనసేన నాయకుడు పంతం నానాజీ సహా.. పలువురు నాయకులు సాయంత్రం పొద్దు పోయిన తర్వాత.. ఎన్నికలు జరిగిన బూత్ల వద్దకు వెళ్లి విషయాన్ని ఆరా తీశారు. తమ పార్టీ ఏజెంట్లు లేకుండానే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించారని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు సహా.. మరో పార్టీ నేతలు చేతులు కలిపి జనసేన నాయకులు లేకుండానే ఇక్కడ పోలింగ్ చేపట్టారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయా డివిజన్లలో తిరిగి పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్టు వివరించారు.
పార్టీపరంగా..
అయితే.. ఈ విషయంపై జనసేన పార్టీ పరంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. పిఠాపురం, విజయనగరం సహా పలు ప్రాంతాల్లో జనసేన అభ్యర్థులకు కేటాయించిన ఏజెంట్లను అనుమతించలేదన్న వార్తలు వచ్చాయని.. వీటిపై సమీక్షిస్తున్నామని పార్టీకార్యాలయ ముఖ్య నేతలు ప్రకటించారు. పూర్తిస్థాయిలో సమాచారాన్ని సేకరించిన తర్వాత.. దీనిపై ప్రకటన చేయనున్నట్టు నాయకులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఎన్నికల పోలింగ్ సరళిని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు తెలిపారు. అనంతరం.. పార్టీ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు.
అలాంటిదేమీ లేదు..
ఇక, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. పులివెందులలోనూ ప్రశాంతంగానే పోలింగ్ ప్రక్రియ సాగిందని చెప్పారు. పిఠాపురంలోకొన్ని వదంతులు మాత్రమే వ్యాపించాయని అవి నిజం కాదని.. ఏజెంట్లు అందరూ ఉన్నారని తెలిపారు. అయినప్పటికీ.. స్థానిక ఉన్నతాధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
This post was last modified on November 2, 2026 10:49 pm
సంతానం లేని ఆ దంపతులు తల్లి చనిపోయిన పసి బిడ్డను దత్తత తీసుకొని గుండెలకు హత్తుకున్నారు. ఆలానా పాలనా చూస్తూ…
ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి కాల పరిమితి తీరిపోయిన నేపథ్యంలో కొత్తగా పాలక మండలిని ఏర్పాటు…
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న రిపీట్ కాంబో ఎట్టకేలకు రంగంలోకి దిగింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,…
భారత దేశంలో గ్రాండ్ ఓల్డ్ ట్రంక్ పార్టీ కాంగ్రెస్ కి గతమంతా ఘనం. అయితే, కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ…
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా AI,…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప రైటర్లలో త్రివిక్రమ్ ఒకడు. దర్శకుడిగా కూడా ఆయన గొప్ప స్థాయినే అందుకున్నాడు. రెండు దశాబ్దాలుగా…