కొన్ని రోజుల కిందట బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్ మీద నడి రోడ్డుపై కొందరు దుండగులు తుపాకులతో దాడికి పాల్పడడం ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. ముంబయిలో గ్రౌండుకెళ్లి ఫుట్‌బాల్ ఆడి కారులో వస్తుండగా.. టైగర్ ష్రాఫ్ మీద ఎటాక్ జరిగింది. చాలా దగ్గర్నుంచి తుపాకీ గుళ్ల వర్షం కురిసినప్పటికీ.. త్రుటిలో ప్రమాదం తప్పించుకున్నాడు టైగర్. ఈ ఉదంతం బాలీవుడ్ స్టార్లను తీవ్ర భయాందోళనకు గురి చేసింది.
అప్పట్నుంచి స్టార్లలో చాలామంది బయటికి రావడానికి భయపడుతున్నారు. వచ్చినా.. గట్టి సెక్యూరిటీ ఉండేలా చూసుకుంటున్నారు. ఈ ఎటాక్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగుకి, టైగర్‌కు ఏ రకమైన సంబంధం లేదు. వాళ్లతో అతడికి వైరమూ లేదు. అయినా అంత పెద్ద ఎటాక్ జరిగింది. కాబట్టి ఇలాంటి అనుభవం ఎవరికైనా ఎదురు కావచ్చనే భయం వెంటాడుతోంది.
ఈ నేపథ్యంలోనే లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్.. అభిమానులను కలిసే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. తన నివాసం దగ్గర ప్రతి ఆదివారం ఫ్యాన్స్‌ను బిగ్-బి కలుస్తారన్న సంగతి తెలిసిందే. ఈసారి మాత్రం ఆయన ప్రత్యేక ఏర్పాట్లతో వచ్చారు. బుల్లెట్ ప్రూష్ గ్లాస్ డోర్లున్న ఒక ప్రత్యేక ట్రాలీలో ఆయన అభిమానుల ముందుకు వచ్చారు. దూరం నుంచి ఎవరైనా తుపాకీతో కాల్చినా ఏమీ కాని విధంగా ఈ ఏర్పాటు చేసుకున్నట్లున్నారు. ఇందుకోసం బాగానే ఖర్చయి ఉండొచ్చు.
అమితాబ్‌కు 84 ఏళ్ల వయసు వచ్చేసింది. ఈ మధ్య ఆరోగ్యం ఏమంత బాగుండట్లేదు. సినిమాలు తగ్గించేశారు. అయినా ఓపిక చేసుకుని కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో మాత్రం కనిపిస్తున్నారు. ఐతే మునుపటిలా చురుగ్గా లేకపోయినా అభిమానులను కలిసే సంప్రదాయాన్ని మాత్రం మానుకోలేదు. ఐతే బాలీవుడ్ స్టార్ల భద్రతపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఆయన ఇలా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు.
This post was last modified on November 2, 2026 12:40 pm
ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు చేసింది అత్యంత అరుదైన నేరం, వారు న్యాయ ప్రక్రియ నుంచి ఎప్పటికీ…
రాప్తాడు ఘటన వెనుక యానిమల్ .. ఆర్జీవీ కౌంటర్నిన్న ఏపీలోని అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన పాఠశాల ఘటన ఎంతటి…
ప్రపంచంలోనే అత్యంత ధనికుల జాబితాలో ఉండే ముకేష్ అంబానీ కుటుంబానికి ఇండియాలో అసలు పోటీయే లేదు. ఎప్పటికప్పుడు వారి సంపద…
పులివెందులలో జరుగుతున్న స్థానిక ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించేందుకు వెళ్లిన జగన్‌కు అడుగడుగునా పరాభవాలు ఎదురయ్యాయి. ఆయన అడుగు పెట్టీ పెట్టడంతోనే…
అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతి విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన ఘటన యావత్ రాష్ట్రాన్ని కలవరపాటుకు గురించేసింది.…
ప్రధాని మోడీ మెడలు వంచుతామని.. ఆయనను గద్దె నుంచి దింపుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీలోని…