మేకింగ్ టైంలో మాత్రం తాపీగా షూటింగ్ చేయడం.. అవసరం లేని షాట్లు తీసుకోవడం.. యాక్టర్ల డేట్లు వేస్ట్ చేయడం.. రీషూట్లు చేయడం.. ఇలా చేయాల్సిన ఆలస్యమంతా చేశాక.. రిలీజ్ డేట్ దగ్గరపడేసరికి హడావుడి పడడం.. పోస్ట్ ప్రొడక్షన్ టైంలో రేయింబవళ్ళు పని చేయడం.. సెన్సార్ సహా అన్ని చోట్లా ఇబ్బందులు తప్పకపోవడం.. టాలీవుడ్లో చాలా సినిమాలకు ఎదురయ్యే అనుభవమే ఇది.
అక్కినేని నాగార్జున సహా ఎంతోమంది పెద్దలు ఈ సమస్య గురించి ప్రస్తావిస్తున్నా.. డైరెక్టర్లు మారట్లేదు. కానీ ఇక నుంచి ఇలాంటి దర్శకులకు కష్టమే. ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటూ.. ఇంకోవైపు సెన్సార్ చేయించుకుందాం అనుకుంటే కుదరదు. మ్యూజిక్ పూర్తి కాకుండా, వీఎఫెక్స్ షాట్స్ జోడించకుండా.. రఫ్ వెర్షన్ సెన్సార్‌కు పంపించి సర్టిఫికెట్ తెచ్చుకుని, తర్వాత అవి యాడ్ చేస్తామంటూ కుదరదని తేల్చేసింది సెన్సార్ బోర్డు.
సెన్సార్ సర్టిఫికేషన్ విషయంలో బోర్డు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం నూటికి నూరు శాతం అన్ని పనులూ పూర్తయిన, థియేటర్లలో రిలీజ్ చేసే కాపీనే సెన్సార్ సర్టిఫికేషన్ కోసం పంపాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలో సెన్సార్ సర్టిఫికేషన్ ఆలస్యం అవుతుంది. లేదా రిజెక్ట్ అవుతుంది. అలాగే రిలీజ్ డేట్ ఇచ్చేశాం, సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వండి అన్నా కుదరదు.
ఈ కారణంతో సెన్సార్ సర్టిఫికేషన్ వేగవంతం చేయడం కుదరదని కూడా తేల్చేసింది బోర్డు. సెన్సార్ కోసం సబ్మిట్ చేసిన ప్రతి సినిమాకూ క్లియరెన్స్ వచ్చేస్తుందనే గ్యారెంటీ లేదని.. రివైజ్డ్ కమిటీకి వెళ్లడం లాంటి పరిణామాలకు సిద్ధంగా ఉండాలని చెప్పకనే చెప్పింది సెన్సార్ బోర్డు. ఈ మార్గదర్శకాలు కొంచెం కఠినంగా అనిపించినా.. అంతిమంగా నిర్మాతలకు మంచే చేస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on November 2, 2026 2:01 pm
మురసు తుఫాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ముందస్తు చర్యలపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో…
70 ఏళ్లు పైబడ్డా సరే, ఈ వయసులోనూ మెగాస్టార్ చిరంజీవి చాలా ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నారు. ఈ తరం దర్శకులతోనూ…
కొన్ని రోజుల కిందట బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్ మీద నడి రోడ్డుపై కొందరు దుండగులు తుపాకులతో దాడికి పాల్పడడం…
ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు చేసింది అత్యంత అరుదైన నేరం, వారు న్యాయ ప్రక్రియ నుంచి ఎప్పటికీ…
రాప్తాడు ఘటన వెనుక యానిమల్ .. ఆర్జీవీ కౌంటర్నిన్న ఏపీలోని అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన పాఠశాల ఘటన ఎంతటి…
ప్రపంచంలోనే అత్యంత ధనికుల జాబితాలో ఉండే ముకేష్ అంబానీ కుటుంబానికి ఇండియాలో అసలు పోటీయే లేదు. ఎప్పటికప్పుడు వారి సంపద…