జ‌గ‌న్ ఆశ తీరుతుందా?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పులి వెందుల‌లో ఆదివారం హ‌ల్చ‌ల్ చేసిన విష‌యం తెలిసిందే. పులివెందుల మునిసిపల్ ఎన్నిక‌ల్లో ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త‌మ‌పార్టీ ఏజెంట్లు లేకుండానే పోలింగ్ చేప‌ట్టార‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అదికారి కార్యాల‌యం ముందు ధ‌ర్నాకు దిగారు. అయితే.. ఈ ప‌రిణామాలు ఎటూ తేలలేదు. చివ‌ర‌కు జ‌గ‌న్ త‌న నిర‌స‌న‌ను తానే విర‌మించుకుని వెన‌క్కి త‌గ్గారు. అయితే.. ఆయ‌న ఈ సంద‌ర్భంగా పులివెందుల‌లో తిరిగి ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేశారు.

అప్పుడు మాత్ర‌మే తాను ఓటు వేస్తాన‌ని తేల్చి చెప్పారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఆకాంక్ష లేదా డిమాండ్ మేర‌కు పులివెందుల‌లో తిరిగి ఎన్నిక‌లు నిర్వ‌హిస్తారా? అనేది ప్ర‌శ్న‌గా మారింది. దీనిపై రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క్లారిటీ ఇచ్చేసింది. ఈ విష‌యంలో తాము సొంత నిర్ణ‌యం తీసుకునేది లేద‌ని తేల్చి చెప్పింది. పూర్తిగా ఆ జిల్లా క‌లెక్ట‌ర్‌, ఎస్పీ ఇచ్చే రిపోర్టు ఆధారంగానే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ పునేఠా తేల్చి చెప్పారు. త‌ద్వారా.. జ‌గ‌న్ ప్ర‌క‌టించిన డిమాండ్‌ను తాము ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునేది లేద‌న్న వాద‌న‌ను ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పిన‌ట్టు అయింది.

స‌హ‌జంగానే ఎన్నిక‌ల స‌మ‌యంలో అనేక ఇబ్బందులు రావొచ్చు.. లేదా కావాల‌నే కొంద‌రు క‌ల్పించ‌వ‌చ్చు. ఈ నేప‌థ్యంలో ప్ర‌తి డిమాండ్‌ను ఎన్నిక‌ల సంఘం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునేది ఉండ‌దు. ఇదే విష‌యాన్ని పునేఠా కూడా చెప్పారు. అనేకమంది అనేక డిమాండ్ లు చేస్తార‌ని అన్నారు. వాటిని తాము ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునేందుకు నిబంధ‌న‌లు ఒప్పుకోవ‌ని చెప్పారు. త‌మ‌కు క్షేత్ర‌స్థాయిలో ఉన్న ఉన్న‌తాధికారులు క‌లెక్ట‌ర్‌, ఎస్పీ వంటి వారి నివేదిక‌లే ప్రామాణిక‌మ‌ని పేర్కొన్నారు. నిబంధ‌న‌లు ఎక్క‌డా దారిత‌ప్ప‌కుండా చూసుకున్నామ‌న్నారు.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ కోరుకున్న‌ట్టు పులివెందుల‌లో తిరిగి పోలింగ్ నిర్వ‌హించ‌డం అనేది క‌లెక్టర్‌, ఎస్పీలు ఇచ్చే నివేదిక‌ల పైనే ఆధార‌ప‌డి ఉంది. అయితే.. క్షేత్ర‌స్థాయిలో అంతా బాగానే జ‌రిగింద‌ని ఇప్ప‌టికే జిల్లా క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. క‌డ‌ప జిల్లా వ్యాప్తంగా చెదురుమ‌దురు ఘ‌ట‌న‌లు మిన‌హా అంతా బాగానే జ‌రిగింద‌న్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఆశిస్తున్న‌ట్టు క‌లెక్ట‌ర్ రీ పోలింగ్ జ‌రిపేలా త‌న సూచ‌న‌లు ఇచ్చే అవకాశం ఉండ‌బోద‌ని తెలుస్తోంది. దీంతో జ‌గ‌న్ ఆశలు తీరేలా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.