Political News

‘రాప్తాడు’ బాలికకు రాబోయే 48 గంటలు కీలకం

అనంతపురం జిల్లాలోని రాప్తాడులో పదో తరగతి బాలికపై తరగతి గదిలోనే అత్యంత పాశవికంగా ఒక ఉన్మాది ఎలక్ట్రికల్ రంపం(చైన్ సా)తో దాడి చేసిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న బాధిత బాలికను మెరుగైన చికిత్స కోసం బెంగుళూరులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

ఈ క్రమంలోనే ఆ బాలికను, ఆమె తల్లిదండ్రులను మణిపాల్ ఆసుపత్రిలో లోకేశ్ పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి, వైద్యం గురించి డాక్టర్లను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆ బాలికకు రాబోయే 48 గంటలు ఎంతో కీలకమని లోకేశ్ అన్నారు. మతం ఏదైనా సరే ఆ పాప కోసం అందరం ప్రార్థిద్దాం అని లోకేశ్ పిలుపునిచ్చారు.

ఆడబిడ్డల జోలికి వచ్చినవారికి రాష్ట్రంలో అదే ఆఖరి రోజు అని లోకేశ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ దాడికి పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదని, నిందితులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఇక, పాప తల్లిదండ్రులకు తన పర్సనల్ నంబర్ ఇచ్చానని, వారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు లోకేశ్.

ఆ సైకో దాడిలో బాలిక మొఖం, మెడ దగ్గర తీవ్రగాయాలయ్యాయని, బాలికకు ప్లాస్టిక్ సర్జరీతో పాటు ఆర్థోపెడిక్ సర్జరీ విజయవంతం అయ్యాయని చెప్పారు. బాధిత బాలికను పిడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్(పీఐసీయూ) లో ఉంచి వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఆమెకు వైద్య సేవలు అందించి ఆమెను ప్రాణాపాయం నుంచి బయటపడేసిన వైద్యుల బృందానికి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. బాధిత బాలిక కుటుంబానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. బాధిత బాలిక కోలుకునేందుకు అవసరమైన మెరుగైన చికిత్సను అందిస్తామని ఆ కుటుంబానికి లోకేశ్ భరోసానిచ్చారు.

కాగా, ఆ బాలికపై దాడికి పాల్పడ్డ కిరాతకుడు హేమంత్ ఆమెకు వరుసకు అన్నయ్య అవుతాడు అని తెలుస్తోంది. అయితే, ప్రేమ పేరుతో ఆ బాలికను అతడు వేధించాడని, పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి చేశాడు. అయితే, ఆ బాలికతో పాటు కుటుంబ సభ్యులు కూడా హేమంత్ ను మందలించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే బాలికపై కక్ష పెంచుకొని ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని తెలుస్తోంది. పాఠశాలలో నిర్మాణ పనులు జరుగుతుండగా.. కూలీ రూపంలో తరగతిలోకి చొరబడ్డాడని టీచర్లు చెబుతున్నారు.

దాంతోపాటు, నిందితుడు గంజాయి, మద్యానికి బానిసగా మారి, గతంలోనూ గర్ల్స్ హాస్టల్‌లో యువతులపై దాడికి పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే హేమంత్ ను కఠినంగా శిక్షించాలని, అప్పుడే ఇటువంటి వారికి గట్టి సందేశం ఇచ్చినట్లు అవుతుందని ప్రజలు కోరుతున్నారు.

This post was last modified on November 1, 2026 4:21 pm

Share

Recent Posts

ఇప్పటివరకు చూడని సూర్యావతారం

ఎన్నో ఏళ్ల పాటు సరైన విజయం లేక ఇబ్బంది పడ్డ తమిళ సూపర్ స్టార్ సూర్య.. ఈ ఏడాది రెండు…

11 minutes ago

RC17… అసలు విషయం చెప్పలేేదే

‘రంగస్థలం’ లాంటి కల్ట్ బ్లాక్‌బస్టర్ అందించిన రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో కొత్త సినిమా కోసం చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు…

1 hour ago

రోడ్డుపై కూర్చొని జగన్ నిరసన

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలోని బ‌కారాపురంలో హ‌ల్చ‌ల్ చేశారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లను…

2 hours ago

జ‌గ‌న్‌కు.. మా జీవితాలు నాశనం చేశావ్!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చేదు అనుభవం ఎదురైంది. పులివెందుల‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చిన జ‌గ‌న్‌కు అనూ హ్యంగా వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో…

3 hours ago

తొలి ఓటు బాల‌య్య‌తోనే

ఏపీలో జ‌రుగుతున్న మునిసిప‌ల్‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ప‌లువురు ప్ర‌ముఖులు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అంతేకాదు.. యువ‌త స‌హా.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి…

3 hours ago

అక్టోబర్ రిపోర్ట్… కిక్కు సరిపోలేదు

విజయదశమి పండగ వచ్చే కీలకమైన అక్టోబర్ నెల అయిపోయింది. టాలీవుడ్ బాక్సాఫిస్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సీజన్ మిశ్రమ…

4 hours ago