Movie News

RC17… అసలు విషయం చెప్పలేేదే

‘రంగస్థలం’ లాంటి కల్ట్ బ్లాక్‌బస్టర్ అందించిన రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో కొత్త సినిమా కోసం చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. మూడేళ్ల ముందే దీని గురించి అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటికీ.. ఇది ముందుకు కదలడంలో చాలా ఆలస్యం జరిగింది. ఎట్టకేలకు ఆదివారం #RC17కు ముహూర్త వేడుక జరిపారు. ఈ సినిమాలో భాగమైన ముఖ్యులతో పాటు మెగాస్టార్ చిరంజీవి, బుచ్చిబాబు సానా, మారుతి.. ఇలా ఎంతోమంది ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఈ మధ్య కాలంలో ఇంత ఘనంగా ఏ సినిమా ప్రారంభోత్సవం జరగలేదని చెప్పొచ్చు. ఈ వేడుక మెగా అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ఐతే సినిమా అధికారికంగా మొదలవడం బాగుందే కానీ.. ఈ రోజు ఫ్యాన్స్ ఆశించిన అప్‌డేట్స్ మాత్రం టీం ఇవ్వలేదు. ఈ చిత్రంలో కథానాయిక ఎవరు, దీనికి సంగీతం అందించేదెవరు అన్న సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

చరణ్, సుకుమార్ సినిమాకు సంగీతం అందించేదెవరన్న దానిపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. తన ఆస్థాన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ను సుకుమార్ తొలిసారిగా పక్కన పెడుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ముందు ‘దురంధర్’ ఫేమ్ శశ్వత్ సచ్‌దేవ్ అని.. తర్వాత అనిరుధ్ రవిచందర్ అని ఈ సినిమా సంగీత దర్శకుడి గురించి ప్రచారం సాగింది. అనిరుధే ఫైనల్ అన్నారు కానీ.. ప్రారంభోత్సవం రోజు కూడా ఈ విషయం అధికారికంగా ప్రకటించలేదు. దాదాపు అనిరుధ్ ఫైనల్ అయ్యాడనేది విశ్వసనీయ సమాచారం.

మరోవైపు ఈ సినిమా హీరోయిన్ గురించి కూడా పెద్ద డిస్కషనే నడిచింది. ‘సైయారా’ ఫేమ్ అనీత్ పడ్డా అని.. ‘దురంధర్’ హీరోయిన్ సారా అర్జున్.. కాదు కాదు భాగ్యశ్రీ బోర్సే అని ముందు వార్తలు వచ్చాయి. నిన్నేమో సాత్విక వీరవల్లి అనే తెలుగమ్మాయే ఫైనల్ అన్నారు. కానీ ఈ రోజు దీని గురించి కూడా స్పష్టత ఇవ్వలేదు. అభిమానులు మరీ ఇంత అయోమయంలో నెట్టడం కరెక్ట్ కాదని.. వీలైనంత త్వరగా ఈ రెండు అప్‌డేట్స్ ఇచ్చేస్తే బెటర్ అని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మరి అధికారిక సమాచారం ఎప్పుడొస్తుందో?

This post was last modified on November 1, 2026 4:14 pm

Share

Recent Posts

‘రాప్తాడు’ బాలికకు రాబోయే 48 గంటలు కీలకం

అనంతపురం జిల్లాలోని రాప్తాడులో పదో తరగతి బాలికపై తరగతి గదిలోనే అత్యంత పాశవికంగా ఒక ఉన్మాది ఎలక్ట్రికల్ రంపం(చైన్ సా)తో…

7 minutes ago

రోడ్డుపై కూర్చొని జగన్ నిరసన

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలోని బ‌కారాపురంలో హ‌ల్చ‌ల్ చేశారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లను…

51 minutes ago

జ‌గ‌న్‌కు.. మా జీవితాలు నాశనం చేశావ్!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చేదు అనుభవం ఎదురైంది. పులివెందుల‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చిన జ‌గ‌న్‌కు అనూ హ్యంగా వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో…

2 hours ago

తొలి ఓటు బాల‌య్య‌తోనే

ఏపీలో జ‌రుగుతున్న మునిసిప‌ల్‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ప‌లువురు ప్ర‌ముఖులు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అంతేకాదు.. యువ‌త స‌హా.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి…

2 hours ago

అక్టోబర్ రిపోర్ట్… కిక్కు సరిపోలేదు

విజయదశమి పండగ వచ్చే కీలకమైన అక్టోబర్ నెల అయిపోయింది. టాలీవుడ్ బాక్సాఫిస్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సీజన్ మిశ్రమ…

3 hours ago

ఏపీలో ప్ర‌జాస్వామ్యం ఉందా

రాష్ట్రంలో జ‌రుగుతున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల పోలింగ్ పై వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం…

4 hours ago