Political News

తెలంగాణ‌కు ప్రకృతి విపత్తులా మారిన ఎల్‌నినో

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం ప్రకృతి విపత్తులా మారింది. ఫ‌లితంగా రాష్ట్రంలో తీవ్రమైన వర్షపాత లోటు నెల‌కొంది. రాబోయే 6 నుండి 8 నెలల పాటు తీవ్రమైన తాగునీరు, సాగునీరు, విద్యుత్ సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది. మ‌రోవైపు వ‌చ్చే ఫిబ్రవరి వ‌ర‌కు ఎల్ నినో ప్ర‌భావం కొన‌సాగుతుంద‌ని చెబుతున్న నేప‌థ్యంలో ఈ క‌ష్టాలు మ‌రింత పెర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భుత్వం పొదుపు మంత్రం పాటించేందుకు రెడీ అయింది. నవంబర్ 1 నుండి అమల్లోకి వచ్చేలా ఒక సమగ్ర కార్యాచరణను రూపొందించింది. ఈ క్ర‌మంలోనే విద్యుత్ వినియోగం, ఏసీల వాడ‌కం, నిర్మాణాల‌కు వినియోగించే నీటిని నిలిపివేయ‌డం వంటి అనేక చ‌ర్య‌లు తీసుకుంది.

ఇక‌, రైతుల‌కు కూడా స‌ర్కారు కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. సాగు నీటి లభ్యత చాలా తక్కువగా ఉండటంతో, రాబోయే యాసంగి (రబీ) సీజన్‌లో ఎక్కువ నీరు అవసరమయ్యే వరి పంట సాగును వాయిదా వేసుకోవాలని ప్ర‌భుత్వం సూచించింది. ఒక ద‌శ‌లో అస‌లు నివారించాలని ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేసింది. అదేస‌మ‌యంలో తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ, కరవును తట్టుకునే పంటలు (ఆరుతడి పంటలు) వేసుకోవాలని సూచించింది. భూగర్భ జలాలు పడిపోతుండటంతో బోరుబావులపై ఆధారపడే రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

రాష్ట్రంలోని 62 ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు సాధారణం కంటే సగానికి పైగా పడిపోయాయి. అందువల్ల జలాశయాల్లో ఉన్న నీటిని కేవలం తాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యతగా కేటాయించాలని అధికారులను ఆదేశించింది. అవసరమైతే రిజర్వాయర్లలోని డెడ్ స్టోరేజ్ నుండి కూడా నీటిని పంపింగ్ చేసి ప్రజలకు అందించడానికి ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ వంటి నగరాల్లో నిర్మాణ రంగం లేదా ఇతర వాణిజ్య అవసరాల కోసం కొత్త బోరుబావులు తవ్వడానికి అనుమతులు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. నిర్మాణాల‌కు అస‌లు నీటిని వినియోగించ‌రాద‌ని తెలిపింది. అదేస‌మ‌యంలో ట్యాంక‌ర్ల ద్వారా నీటిని స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

కరంట్ పొదుపుపై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా దండోరా వేయాల‌ని నిర్ణ‌యించారు. రాబోయే ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 24 వేల మెగావాట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. విద్యుత్‌ను వృధా చేయకుండా ఊరూరా దండోరా వేయించి ప్రచారం చేయాలని నిర్ణయించింది. అయితే.. అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తే బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేస్తామని సీఎం హెచ్చరించారు. థర్మల్ ప్లాంట్లలో గరిష్ట విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చూడాలని ఆదేశించారు. ఎల్‌నినో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.

కరవు, ఎల్‌నినో పరిస్థితులను మండలాల వారీగా, జిల్లాల వారీగా మైక్రో-లెవెల్‌లో పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. తాగునీటితో పాటు పశువులకు మేత (దాణా) కొరత రాకుండా పశుగ్రాస బ్యాంకులు ఏర్పాటు చేయాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఇక‌, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లోనూ.. ఏసీల‌ను నాలుగు గంట‌లు(మ‌ధ్యాహ్నం 12-4 గంట‌ల వ‌ర‌కే వినియోగించాలి) మాత్ర‌మే వేయాల‌ని.. అది కూడా 25 డిగ్రీల మ‌ధ్యే పెట్టాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉంటే.. అస‌లు ఆ స‌మ‌యంలోనూ వినియోగించ‌రాద‌ని పేర్కొంది. సో.. భ‌విష్య‌త్తులో త‌లెత్తే మ‌రింత గ‌డ్డు ప‌రిస్థితిని ప్ర‌స్తుత ప‌రిస్థితి స్ప‌ష్టం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on October 20, 2026 1:19 pm

Share

Recent Posts

ముద్ర‌గ‌డ కుటుంబ రాజకీయానికి అడ్డుకట్ట వేస్తుంది ఎవరు?

వైసీపీ త‌ర‌ఫున ముద్ర‌గ‌డ కుటుంబానికి ద‌క్కుతున్న ఆద‌ర‌ణ ఎంత‌? ప‌ద్మ‌నాభం మృతి చెందిన త‌ర్వాత‌.. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామ‌ని చెప్పిన…

51 minutes ago

త్రివిక్రమ్‌ గుర్తించాల్సిన అసలు ముప్పు

ఆదర్శ కుటుంబం అఫీషియల్ డేట్ కేవలం పది రోజుల ముందు వచ్చింది. వెంకటేష్ ద్వారా ఆన్ లైన్ అనౌన్స్ మెంట్…

1 hour ago

ప్రతిసారీ పోలికంటే ఎలా తమన్?

పేరుకేమో తెలుగులో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్. పెద్ద పెద్ద హీరోలు, డైరెక్టర్లు అతనే కావాలంటారు. భారీ సినిమాలకు పని…

2 hours ago

వంగవీటి రాధా అందరివాడు

విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానానికి జనసేన తరపున కూటమి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న వంగవీటి రాధాకృష్ణ పై వ‌స్తున్న…

3 hours ago

ఈ కారణంతో సాయిపల్లవిని ద్వేషించడమా?

ఒకప్పుడు నటీనటుల అందచందాలు, యాక్టింగ్ స్కిల్స్‌ను బట్టే సినిమాలు చూసేవారు జనాలు. కానీ సోషల్ మీడియా జమానాలో సినిమాలు చూడ్డానికి,…

3 hours ago

ఇండస్ట్రీ హిట్… ఎవ్వరికీ ఇవ్వవా రజినీ?

ఎప్పుడో 1998లో కమల్ హాసన్ ‘ఇండియన్’ సినిమాతో తమిళంలో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అప్పట్నుంచి 28 ఏళ్లు గడిచాయి. ఇన్నేళ్లలో…

4 hours ago