నిన్న హైదరాబాద్ లో జరిగిన రామాయణ పార్ట్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాష్ అన్న మాటలు ఇండస్ట్రీ వర్గాలు, ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ గా మారాయి. విఎఫ్ఎక్స్ లో చిన్న చిన్న లోపాలు, తప్పులు ఉంటే వెతకవద్దని, నిర్మాత నమిత్ లాంటి వారిని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉందని చెప్పాడు. అంటే ముందుగానే ప్రిపేర్ చేయడంలో భాగంగా ఇలా అన్నాడా లేక టాక్సిక్ టైంలో జరిగిన విపరీతమైన నెగటివిటీని దృష్టిలో పెట్టుకుని అలెర్టయ్యాడా అనేది తను మాత్రమే చెప్పగలడు.
ప్రాక్టికల్ గా చూసుకుంటే యష్ ఇలా అనకుండా ఉండాల్సిందనేది అధిక శాతం వ్యక్తపరుస్తున్న అభిప్రాయం. ఎందుకంటే నాలుగు కోట్లతో తీసినా నాలుగు వేల కోట్లతో తీసినా బడ్జెట్ లెక్కలు ఆడియన్స్ కి అనవసరం. తన టికెట్ డబ్బుకు న్యాయం జరిగిందా, రెండున్నర గంటలు సంతృప్తి పరిచారా లేదాని మాత్రమే చూసుకుంటాడు. అది జరిగిన నాడు బాహుబలి లాగా నెత్తిన బెట్టుకుంటాడు. లేనినాడు ఆదిపురుష్ తరహాలో వివిధ రూపాల్లో తన అసంతృప్తి చూపిస్తాడు.
ఇది ఇప్పుడే కాదు ఎప్పటికైనా వర్తించే సూత్రమే. రామాయణ నిజంగా బాగున్నప్పుడు ఎలాంటి స్టేట్ మెంట్స్ అక్కర్లేదు. జనం ఎగబడి చూస్తారు. విఎఫ్ఎక్స్ ని భూతద్దంలో పెట్టి చూడరు. గ్రాఫిక్స్ టెక్నాలజీ అంతగా లేని కాలంలోనే కోడి రామకృష్ణ అమ్మోరు, అరుంధతి లాంటి అద్భుతాలు సృష్టించారు. అలాంటప్పుడు ఇప్పటి ఏఐ ప్రపంచంలో ప్రేక్షకులు ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం తప్పు, నేరం కాదు. వాటిని అందుకోవాల్సిన బాధ్యత ముమ్మాటికీ దర్శక నిర్మాతలదే.
రావణుడిగా నటించడమే కాక నిర్మాణ భాగస్వామిగానూ ఉన్న యష్ కు రామాయణ విజయం ఎంత ముఖ్యమో చెప్పాల్సిన పని లేదు. టాక్సిక్ ని మర్చిపోవడానికి ఇది మందులా పని చేయాలి. హీరో తను కాకపోయినా రావణుడిగా గొప్ప పేరు వస్తే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. నవంబర్ 5 విడుదలకు రెడీ అవుతున్న ఈ ఎపిక్ గ్రాండియర్ ని ఏపీ తెలంగాణలో దిల్ రాజు పంపిణి చేస్తున్నారు. యష్ తో పాటు రన్బీర్ కపూర్, సాయిపల్లవి పెర్ఫార్మన్స్ రామాయణకు చాలా కీలకం కాబోతోంది.
This post was last modified on October 20, 2026 1:28 pm
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం ప్రకృతి విపత్తులా మారింది. ఫలితంగా రాష్ట్రంలో తీవ్రమైన వర్షపాత లోటు నెలకొంది. రాబోయే 6 నుండి…
వైసీపీ తరఫున ముద్రగడ కుటుంబానికి దక్కుతున్న ఆదరణ ఎంత? పద్మనాభం మృతి చెందిన తర్వాత.. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పిన…
ఆదర్శ కుటుంబం అఫీషియల్ డేట్ కేవలం పది రోజుల ముందు వచ్చింది. వెంకటేష్ ద్వారా ఆన్ లైన్ అనౌన్స్ మెంట్…
పేరుకేమో తెలుగులో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్. పెద్ద పెద్ద హీరోలు, డైరెక్టర్లు అతనే కావాలంటారు. భారీ సినిమాలకు పని…
విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానానికి జనసేన తరపున కూటమి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న వంగవీటి రాధాకృష్ణ పై వస్తున్న…
ఒకప్పుడు నటీనటుల అందచందాలు, యాక్టింగ్ స్కిల్స్‌ను బట్టే సినిమాలు చూసేవారు జనాలు. కానీ సోషల్ మీడియా జమానాలో సినిమాలు చూడ్డానికి,…