Political News

ముద్ర‌గ‌డ కుటుంబ రాజకీయానికి అడ్డుకట్ట వేస్తుంది ఎవరు?

వైసీపీ త‌ర‌ఫున ముద్ర‌గ‌డ కుటుంబానికి ద‌క్కుతున్న ఆద‌ర‌ణ ఎంత‌? ప‌ద్మ‌నాభం మృతి చెందిన త‌ర్వాత‌.. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామ‌ని చెప్పిన వైసీపీ నేత‌లు. ఆ త‌ర్వాత ఆయ‌న‌ను మ‌రిచిపోయిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. తాజాగా జ‌రుగుతున్న స్థానిక ఎన్నిక‌ల్లో ముద్ర‌గ‌డ ఫ్యామిలీ నుంచి మునిసిప‌ల్ చైర్మ‌న్ అభ్య‌ర్థిని ఎంపిక చేస్తే బాగుంటుంద‌ని కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన వైసీపీ నాయ‌కులు జ‌గ‌న్‌కు సూచించార‌ని.. దీనిపై చ‌ర్చించార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

ముఖ్యంగా కాపు సామాజిక వ‌ర్గంలో ముద్ర‌గ‌డ‌కు ఉన్న గుర్తింపు నేప‌థ్యంలో వైసీపీ ఆ కుటుంబానికి అండ‌గా నిలిస్తే .. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కాపు ఓటు బ్యాంకు ప‌దిలంగా వైసీపీకి ప‌డుతుంద‌న్న ఆలోచ‌న‌ను కూడా పంచుకున్నారు. ప్ర‌స్తుతం ముద్ర‌గ‌డ కుటుంబం నుంచి ఆయ‌న చిన్న కుమారుడు గిరి వైసీపీలో ఉన్నారు. ఆయ‌న ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో ఆయ‌న స్థానిక ఎన్నిక‌ల్లో పోటీకి విముఖ‌త వ్య‌క్తం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌పైనే దృష్టి పెట్టారు.

కానీ, ప్ర‌స్తుతం ముద్ర‌గ‌డ మ‌ర‌ణం.. అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ఏర్ప‌డిన సానుభూతి వంటివి ద‌క్కించుకునేందుకు ముద్ర‌గ‌డ స‌తీమ‌ణి ప‌ద్మావ‌తికి స్థానిక ఎన్నిక‌ల్లో అవ‌కాశం ఇవ్వాల‌ని మాజీ ఎమ్మెల్యే లు కొంద‌రు సూచించారు. దీనికి తొలుత జ‌గ‌న్ కూడా త‌లూపారని అంటున్నారు. ముద్ర‌గ‌డ కుటుంబం నుంచి గిరి రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా.. తండ్రి అంత స్థాయిలో ఆయ‌న హ‌వా ప్ర‌ద‌ర్శించ‌లేక పోతున్నార‌న్న‌ది వాస్త‌వం. అందుకే.. ఆ లోటును భ‌ర్తీ చేసేందుకు ప‌ద్మావ‌తిని బ‌రిలోకి తీసుకురావాల‌ని అనుకున్నారు.

ఏం జరిగింది..?
ముద్ర‌గ‌డ కుటుంబం నుంచి మ‌రోనేత‌కు అవ‌కాశం ఇవ్వాల‌న్న ప్ర‌తిపాద‌న‌ను వైసీపీలోనే ఓ కీల‌క నాయ‌కుడు అడ్డుకున్న‌ట్టు తెలిసింది. ఒకేఫ్యామిలీ నుంచి ఇంత మందికి అవ‌కాశం ఇవ్వ‌డం స‌రికాద‌న్న ఆయ‌న సూచ‌న‌తో ప‌ద్మావ‌తి విష‌యాన్ని ప‌క్క‌న పెట్టార‌ని అంటున్నారు. అయితే.. స‌హ‌జంగానే ప‌ద్మావ‌తి కూడా ఎప్పుడూ రాజ‌కీయాల్లోకి రాలేదు. కానీ, రాకూడ‌ద‌ని ఏమీ లేదు. ఇప్పుడు స‌రైన స‌మ‌య‌మ‌ని కూడా అంటున్నారు. కానీ, ఓ కీల‌క నాయ‌కుడు చ‌క్రం తిప్ప‌డంతో ముద్రగ‌డ‌ కుటుంబం విష‌యాన్ని జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టార‌ని అంటున్నారు. ఈ వ్య‌వ‌హారం కాపు నాయ‌కుల్లో చ‌ర్చ‌కు దారితీసింది.

This post was last modified on October 20, 2026 1:03 pm

Share

Recent Posts

త్రివిక్రమ్‌ గుర్తించాల్సిన అసలు ముప్పు

ఆదర్శ కుటుంబం అఫీషియల్ డేట్ కేవలం పది రోజుల ముందు వచ్చింది. వెంకటేష్ ద్వారా ఆన్ లైన్ అనౌన్స్ మెంట్…

36 minutes ago

ప్రతిసారీ పోలికంటే ఎలా తమన్?

పేరుకేమో తెలుగులో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్. పెద్ద పెద్ద హీరోలు, డైరెక్టర్లు అతనే కావాలంటారు. భారీ సినిమాలకు పని…

2 hours ago

వంగవీటి రాధా అందరివాడు

విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానానికి జనసేన తరపున కూటమి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న వంగవీటి రాధాకృష్ణ పై వ‌స్తున్న…

2 hours ago

ఈ కారణంతో సాయిపల్లవిని ద్వేషించడమా?

ఒకప్పుడు నటీనటుల అందచందాలు, యాక్టింగ్ స్కిల్స్‌ను బట్టే సినిమాలు చూసేవారు జనాలు. కానీ సోషల్ మీడియా జమానాలో సినిమాలు చూడ్డానికి,…

2 hours ago

ఇండస్ట్రీ హిట్… ఎవ్వరికీ ఇవ్వవా రజినీ?

ఎప్పుడో 1998లో కమల్ హాసన్ ‘ఇండియన్’ సినిమాతో తమిళంలో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అప్పట్నుంచి 28 ఏళ్లు గడిచాయి. ఇన్నేళ్లలో…

3 hours ago

ఆదిపురుష్ భయం.. రామాయణంను వెంటాడుతోందా?

ఇంకో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘రామాయణం: పార్ట్1’ సినిమా. రెండు భాగాలకు కలిపి ఏకంగా రూ.4 వేల…

6 hours ago