తాజాగా వైసీపీ అధినేత జగన్ వ్యవహరించిన తీరు ఆశ్చర్యకరంగా మారింది. ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ అనిల్ చంద్రపునేఠాపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆదివారం ఉదయం బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చిన జగన్.. సుమారు గంటన్నరపాటు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శుక్రవారం, శనివారం జరిగిన ఘటనలను ఉదహరించారు. ఈ సందర్భంగా కమిషనర్ పునేఠాపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన కూడా చంద్రబాబు స్నేహితుడేనని వ్యాఖ్యానించారు.
గత 2019 ఎన్నికల సమయంలో పునేఠా కూడా ఎన్నికల సంఘంలో సభ్యుడిగా ఉన్నారని.. అయితే, ఆయన చంద్రబాబుకు ఫేవర్ చేస్తున్నాడని తెలిసి.. సుప్రీంకోర్టు పక్కన పెట్టిందని చెప్పారు. అయినప్పటికీ.. చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఆయనను కాపాడుకునే ప్రయత్నం చేశారని అన్నారు. కానీ సుప్రీంకోర్టు ఆ పిటిషన్ను కొట్టివేసిందని గుర్తు చేశారు. అయితే.. పునేఠా రిటైర్మెంటు తర్వాత.. చంద్రబాబు మళ్లీ తీసుకువచ్చి ఎన్నికల సంఘం కమిషనర్గా నియమించారని.. దీనిని బట్టి వారి మధ్య బంధం ఎలాంటిదో అర్ధం కావట్లేదా? అని వ్యాఖ్యానించారు.
కేవలం మూడు రోజులు..
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియను కేవలం మూడు రోజులకే పరిమితం చేయడంపై జగన్ విమర్శలు గుప్పించారు. ఇది కావాలని చేసిన ప్రక్రియని అన్నారు. రెండు రోజుల ముందు రిజర్వేషన్ ప్రకటించి.. ఆ రోజే నోటిఫికేషన్ ఇచ్చారని.. అందులోనూ.. ఒక ఆదివారం వచ్చేలా పక్కా వ్యూహంతో అనుసరించారని అన్నారు. ఇదంతా చంద్రబాబుపై ప్రేమతో పునేఠా చేసిన వ్యూహమని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలకు కనీసం సమయం కూడా ఇవ్వలేదన్నారు. ఇక, తాజాగా జరుగుతున్న ఘర్షణలను కూడా అరికట్టేందుకు పునేఠా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
చిత్రం ఏంటంటే..
దాదాపు 20 నిమిషాలపాటు పునేఠా పుట్టుపూర్వోత్తరాల నుంచి విమర్శలు గుప్పించిన జగన్.. అనంతరం.. అదే పునేఠాను కలుసుకునేందుకు విజయవాడకు వెళ్లారు. ఎన్నికల సంఘం తీరుపైన.. వైసీపీ నాయకులపై జరిగిన దాడులపైనా ఆయనకే ఫిర్యాదు చేసేందుకు పునేఠా కార్యాలయానికి వెళ్లారు.
ఇక, పునేఠా.. జగన్ను ఆత్మీయంగా స్వాగతించి.. ఆయన ఇచ్చిన ఫిర్యాదులను తీసుకున్నారు. వాటిని అక్కడే పరిశీలించారు. అయితే.. జగన్ మీడియాతో సహా తన కార్యాలయంలోకి రావడం పట్ల పునేఠా ఒకింత అసహనం వ్యక్తం చేసినట్టు కనిపించింది. ఏదేమైనా పునేఠాను తిట్టిపోసి.. ఆయనకే ఫిర్యాదు చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
This post was last modified on October 18, 2026 11:16 pm
కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న విషయమే నిజమని తేలిపోయింది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ సినిమా ‘స్పిరిట్’ వచ్చే ఏడాది…
వైసీపీ అధినేత జగన్ సొంత ఇలాకా.. కడప జిల్లాలోనే ఆ పార్టీ పరిస్థితి ఇబ్బందుల్లో పడింది. ఆదివారం మధ్యాహ్నం 3…
తెలుగులో దర్శకుడయ్యే ప్రతి వ్యక్తికీ.. తప్పక సినిమా చేయాలనిపించే హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన సినిమాలు చూసి దర్శకులయ్యాం అని…
తెలంగాణలో దసరా వచ్చిందంటే.. ఎక్కడ చూసినా సందడే సందడి. బతుకమ్మ పాటలు, ఆటలతో ఈ ప్రాంతం కళకళలాడిపోతుంది. వేరే ప్రాంతాల…
బాక్సాఫీస్ వద్ద మెల్లగా పుంజుకుంటున్న గరివిడి లక్ష్మికి మంచి ప్రశంసలే దక్కుతున్నాయి. ముఖ్యంగా ఆవిడ ప్రాంతమైన ఉత్తరాంధ్రలో చెప్పుకోదగ్గ కలెక్షన్లు…
ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయి రాజకీయాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. ప్రధానంగా కొన్ని…