Movie News

తెలుగు ప్రతిభని గుర్తించడం లేటయ్యింది

బాక్సాఫీస్ వద్ద మెల్లగా పుంజుకుంటున్న గరివిడి లక్ష్మికి మంచి ప్రశంసలే దక్కుతున్నాయి. ముఖ్యంగా ఆవిడ ప్రాంతమైన ఉత్తరాంధ్రలో చెప్పుకోదగ్గ కలెక్షన్లు వస్తున్నాయి. ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా నిజాయితీగా దర్శకుడు గౌరీ నాయుడు చేసిన ప్రయత్నం విమర్శకులను మెప్పించింది. అయితే అన్నిటికన్నా ఎక్కువగా చెప్పుకోవాల్సిన విషయం టైటిల్ రోల్ పోషించిన ఆనంది గురించి. వరంగల్ కు చెందిన ఆ అచ్చ తెలుగు నైజాం అమ్మాయి తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది.

గరివిడి లక్ష్మిలో ఆనంది నటన చాలా సహజంగా ఉంది. ఎమోషన్స్ సరైన రీతిలో పలికించింది. స్వంతంగా డబ్బింగ్ చెప్పుకోవడంతో పాటు డాన్సుల్లోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా మెప్పించింది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే మన తెలుగు ప్రతిభను గుర్తించడంలో జరిగిన ఆలస్యం గురించి. 2012 ఈ రోజుల్లో, బస్ స్టాప్ ద్వారా ఇండస్ట్రీకి వచ్చిన ఆనంది 2014 తమిళ మూవీ కయల్ తో తొలి బ్రేక్ అందుకుంది. వెట్రిమారన్, మారి సెల్వరాజ్ లాంటి కల్ట్ డైరెక్టర్స్ తో పని చేసింది.

తెలుగులో జాంబీ రెడ్డి లాంటి ఒకటి రెండు సూపర్ హిట్స్ ఉన్నప్పటికీ సరైన బ్రేక్ దక్కలేదు. ఆ మధ్య భైరవం లాంటివి ఒకటి రెండు చేసినా ఫలితం దక్కలేదు. గౌరీ నాయుడుకి ఆలోచన ఎలా వచ్చిందో కానీ గరివిడి లక్ష్మికి ఆమెను ఛాయస్ గా ఎంచుకోవడం చాలా ప్లస్ అయ్యింది. ముందు డౌట్ పడిన వాళ్ళు సైలెంటయ్యారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూసిన పాత్రలో చాలా వేరియేషన్లు పలికించిన తీరు ఈ మధ్య కొన్నేళ్లలో చాలా కొందరికే సాధ్యమయ్యిందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

అయితే కమర్షియల్ గా గరివిడి లక్ష్మి మహానటి రేంజ్ కు వెళ్లకపోవచ్చు కానీ కంటెంట్, క్యాస్టింగ్ పరంగా దానికి పోటీ ఇచ్చేలా అయితే కొంత వరకు ఉంది. రాజా సాబ్ తో తీవ్రంగా నిరాశపరిచిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థకు ఖచ్చితంగా ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టకపోయినా ఒక మంచి ప్రయత్నం అనే ముద్ర ఇచ్చింది. భవిష్యత్తులో ఎలాంటి అనుమానం లేకుండా అవార్డులు రావడం ఖాయమే. వసూళ్లలోనూ మంచి నెంబర్లు అందుకుంటే దీనికి సార్థకత చేకూరుతుంది.

This post was last modified on October 18, 2026 10:42 pm

Share

Recent Posts

సందీప్ వంగను అభినందించాలి

కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న విషయమే నిజమని తేలిపోయింది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ సినిమా ‘స్పిరిట్’ వచ్చే ఏడాది…

1 hour ago

జగన్ ఇలాకాలోనే సగానికి పైగా ఏకగ్రీవాలా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత ఇలాకా.. క‌డ‌ప జిల్లాలోనే ఆ పార్టీ ప‌రిస్థితి ఇబ్బందుల్లో ప‌డింది. ఆదివారం మ‌ధ్యాహ్నం 3…

3 hours ago

పేట దర్శకుడికి ఛాన్సివ్వాలి బాసు

తెలుగులో దర్శకుడయ్యే ప్రతి వ్యక్తికీ.. తప్పక సినిమా చేయాలనిపించే హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన సినిమాలు చూసి దర్శకులయ్యాం అని…

3 hours ago

తెలంగాణ కోడలు ర‌ష్మిక బ‌తుక‌మ్మ ఆడితే…

తెలంగాణ‌లో ద‌స‌రా వ‌చ్చిందంటే.. ఎక్క‌డ చూసినా సంద‌డే సంద‌డి. బ‌తుక‌మ్మ పాట‌లు, ఆట‌ల‌తో ఈ ప్రాంతం క‌ళ‌క‌ళ‌లాడిపోతుంది. వేరే ప్రాంతాల…

4 hours ago

పునేఠాను తిట్టి ఆయ‌న‌కే ఫిర్యాదు చేసిన జ‌గ‌న్‌

తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించిన తీరు ఆశ్చ‌ర్య‌క‌రంగా మారింది. ఏపీ ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ అనిల్ చంద్ర‌పునేఠాపై…

4 hours ago

స్థానికంలో మ్యాచ్ ఫిక్సింగ్‌లు మొదలయ్యాయా?

ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయి రాజకీయాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. ప్రధానంగా కొన్ని…

4 hours ago